మొబైల్, టాబ్లెట్, టివి, అక్సెసోరిస్, ఇతర ఎలక్ట్రానిక్స్‌తో సహా అన్నిటిపై డిస్కౌంట్, ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు సెల్ సమయంలో కొనుగోలు చేయలనుకునే వాటిపై  ప్రీ-బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తోంది. 

ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సెల్ ప్రకటించింది. సెప్టెంబర్ 18 నుండి 20 వరకు కొనసాగుతుంది. మొబైల్, టాబ్లెట్, టివి, అక్సెసోరిస్, ఇతర ఎలక్ట్రానిక్స్‌తో సహా అన్నిటిపై డిస్కౌంట్, ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు సెల్ సమయంలో కొనుగోలు చేయలనుకునే వాటిపై ప్రీ-బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తోంది. ఈ ప్రీ-బుక్ ఆఫర్ సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 16 వరకు ఉంటుంది. ఎస్‌బి‌ఐ కార్డ్ వినియోగదారులకు ఏ‌టి‌ఎం ద్వారా చేసే పేమెంట్లకు లేదా ఇఎంఐ చెల్లింపులపై తగ్గింపు కూడా పొందవచ్చు.

బిగ్ సేవింగ్ డేస్‌లో లభించే ఉత్పత్తుల వివరాలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించకపోయిన మొబైల్ ఫోన్లు,టీవీలు, టాబ్లెట్‌లను కొనడానికి ఆసక్తి ఉన్న కస్టమర్లు జీరో ఇఎంఐ ప్లాన్లు, కార్డ్‌లెస్ క్రెడిట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను పొందవచ్చని పేర్కొంది.

also read టిక్‌టాక్‌ను విక్రయిస్తారా లేదా మూసేస్తారా మీరే తేల్చుకొండి: డొనాల్డ్ ట్రంప్ ...

జీరో ఇఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో బిగ్ సేవింగ్ డేస్ సందర్భంగా మూడు కోట్లకు పైగా ఎలక్ట్రానిక్స్, అక్సెసోరిస్ అమ్మకానికి ఉంటాయి. వైర్‌లెస్ మౌస్, కీబోర్డులు, పవర్ బ్యాంకులు, కేబుల్స్, హెడ్‌ఫోన్‌లు మరిన్ని ఉత్పత్తులపై ఆకర్షణీయమైన తగ్గింపులు ఇస్తుంది.

అదనంగా ఎస్‌బి‌ఐ కార్డ్ వినియోగదారులు ఎస్‌బి‌ఐ క్రెడిట్ కార్డ్ ఇఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. సెప్టెంబర్ 15 నుండి 16 వరకు నిర్వహించనున్న ప్రీ-బుకింగ్ లో కేవలం రూ.1 చెల్లించాలి ప్రీ-బుక్ చేసుకోవచ్చు.

దీని కోసం వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ హోమ్‌పేజీలోని ప్రీ-బుక్ స్టోర్‌ను చూడండి. అంతకుముందు బిగ్ సేవింగ్ డేస్ సెల్ లో ఐఫోన్ ఎక్స్ఆర్ (రూ. 44,999), ఐఫోన్ ఎస్ఇ రూ. 36,999, ఒప్పో రెనో 2 పై రూ .10,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ తో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లను ఇచ్చింది.

ఇతర వస్తువులలో కొన్ని ఏసర్ ల్యాప్‌టాప్‌లు, వైర్‌లెస్ స్పీకర్లు, అలాగే వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు ఉన్నాయి.