ఇండియాలో ఐఫోన్ అమ్మకాలకు తగ్గని డిమాండ్...ఆపిల్ సీఈఓ

ఆపిల్ ఐప్యాడ్ అమ్మకాలు భారతదేశంతో పాటు మలేషియా, మెక్సికో, ఫిలిప్పీన్స్, పోలాండ్, థాయిలాండ్, టర్కీ, వియత్నాం వంటి దేశ మార్కెట్లలో కూడా మంచి వృద్ధిని సాధించింది.

iphone sales in india seen double digit growth says apple ceo tim cook

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఆపిల్ ఇండియాలో తమ స్మార్ట్ ఫోన్స్ సేల్స్ వివరాలను వెల్లడించింది.స్మార్ట్ ఫోన్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఆపిల్ ఇఫోన్ తాజాగా వాటి అమ్మకాల వివరాలను తెలిపింది. ఐఫోన్ 11 అమ్మకాలతో ఉత్సాహంగా ఉన్న ఆపిల్, అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలం ఐఫోన్ మోడల్స్ భారతదేశంలో రెండంకెల వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు.

also read ట్రంప్‌కు షాక్: 5జీ...సేవలకు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్

"బ్రెజిల్, చైనా, ఇండియా, థాయిలాండ్, టర్కీ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఆపిల్ స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలు రెండు అంకెలు వృద్ది పెరిగిందని" అని టిమ్  కుక్  తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ మోడళ్ల ద్వారా వచ్చిన ఆదాయం 56 బిలియన్ డాలర్లు.

iphone sales in india seen double digit growth says apple ceo tim cook

"ఇది ఒక సంవత్సరం క్రితం కంటే 8 శాతం ఎక్కువ, ఐఫోన్ 11 ధర 63,900, ఐఫోన్ 11 ప్రో ధర 96,900, ఐఫోన్ 11 ప్రో మాక్స్ కోసం ఉన్న డిమాండ్ కి మా  కృతజ్ఞతలు.  డిసెంబర్ త్రైమాసికంలో ప్రతి వారంలో ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్ అత్యధికంగా అమ్ముడైన మోడల్, ఈ మూడు కొత్త మోడళ్లు అత్యంత పోపులరిటీ పొందిన ఐఫోన్‌లు" అని  టిమ్ కుక్ తెలిపాడు.

also read ఫెక్ యాప్ లను గుర్తించేందుకు పేటి‌ఎం కొత్త ఫీచర్

ఆపిల్ మాక్, ఐప్యాడ్ ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలో 7.2 బిలియన్ల ఆదాయాన్ని తెచ్చాయి."ఐప్యాడ్ కోసం మెక్సికో, ఇండియా, టర్కీ, పోలాండ్, థాయిలాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మంచి వృద్ధి చూపించింది" అని కుక్ చెప్పారు.

 
ఇదిలావుండగా, ఆపిల్ తన హోమ్‌పాడ్ స్మార్ట్ స్పీకర్‌ను ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన సమయంలో హోమ్‌పాడ్ స్మార్ట్ స్పీకర్ ప్రాడక్ట్ పేజీని కంపెనీ తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది.  భారతదేశంలో హోమ్‌పాడ్  ధర రూ. 19,990. కానీ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios