స్మార్ట్ ఫోన్లలో కొన్ని యాప్స్ ద్వారా  మోసపూరితమైన లావాదేవీలను జరుగుతుంటాయి. అది ఏ యాప్ ద్వారా జరిగిందో పసిగట్టి మొబైల్ వినియోగదారునికి ఆ యాప్ డిలెట్ చేయమని హెచ్చరిస్తుంది. పేటి‌ఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పిపిబిఎల్ ) “రోగ్” పేరిట ఒక కొత్త  ఫీచర్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించి వివరాలను పిపిబిఎల్ సోమవారం తెలిపింది. అలాంటి యాప్ లను అన్‌ఇన్‌స్టాల్ చేయమని వినియోగదారులకు సలహా కూడా ఇస్తుంది.

అనుమానాస్పద లేదా మోసపూరితమైన లావాదేవీలను వెంటనే గుర్తించడానికి ఇంకా వాటిని నిరోధించడానికి ఇది ఆర్టిఫిసియల్  ఇంటెలిజెన్స్ ను ప్రోత్సహిస్తోంది. ఇంకా  మోసపూర్తితమిన ఫేక్  కాల్స్, ఎస్‌ఎం‌ఎస్ లను గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా దీనిపై అవేర్నెస్ డ్రైవ్‌లను కూడా చేపడుతోందని బ్యాంక్ తెలిపింది.

also read వొడాఫోన్ ఐడియాకు గుడ్ బై - రిలయన్స్ జియోకు వెల్‌కం

వినియోగదారు ఖాతాలకు సంబంధించి వివరాలను,సమాచారాని కాపాడటానికి పిపిబిఎల్ చర్యలు తీసుకుంటోంది. సరికొత్త సైబర్‌ సెక్యూరిటీ టూల్స్ ఉపయోగిస్తు బ్యాంక్ ముఖ్యమైన అప్ డేట్ లను అందిస్తుంది.ఈ సరికొత్త ఫీచర్ వినియోగదారుడి డివైజ్ లో  "రోగ్" ద్వారా ఫెక్ యాప్ లను గుర్తించి మోసపూరిత లావాదేవీలు జరగటానికి అవకాశమున్న యాప్ లను గుర్తించి వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయమని వినియోగదారులకు సలహా ఇస్తుంది, ”అని ఒక ప్రకటనలో తెలిపింది.

పిపిబిఎల్ ఎండి, సిఇఒ సతీష్ గుప్తా మాట్లాడుతూ "ప్రతి వినియోగదారుడి లావాదేవీలు తన ప్లాట్‌ఫామ్‌లో సురక్షితంగా, సెక్యుర్ గా  ఉండేలా బ్యాంక్ అన్ని ప్రయత్నాలు చేపడుతుంది.“ఈ సెక్యూరిటి  ఫీచర్ వినియోగదారుడి డివైజ్ లో ఇన్‌స్టాల్ చేసిన యాప్ లను స్కాన్ చేసి వినియోగదారుల ఖాతాలకు సంబంధించి వివరాలను, సమాచారాని ప్రమాదంలో పడేసే ప్రమాదకరమైన యాప్ లను చూపిస్తూ వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయమని వార్నింగ్ చేస్తుంది.

అలాంటి మోసపూరితమైన యాప్ లను వినియోగదారుడు అన్‌ఇన్‌స్టాల్ చేసే వరకు లావాదేవీలు సాధ్యం కావు, ”అని సిఇఒ సతీష్ గుప్తా అన్నారు.ఈ కొత్త ఫీచర్ కస్టమర్లకు తెలియకుండా జరగబోయే మోసపూరితమైన లావాదేవీలను గుర్తించి ఆపేశాయని ఇంకా ఇలాంటి  మోసపూరితమైన లావాదేవీ కేసులను పిపిబిఎల్ ఇప్పటికే చూసిందని గుప్తా చెప్పారు.

also read సాంసంగ్ నుండి కొత్త గెలాక్సీ స్మార్ట్ ఫోన్.. రేపే లాంచ్...

"మోసపూరితమైన లావాదేవీల గురించి వినియోగదారులకి అవగాహన కల్పించడం మేము కొనసాగిస్తాము అలాగే ఇటువంటి మోసల నుండి వారిని వారు రక్షించుకునే మార్గాలపై మేము మరింత అవగాహన కల్పిస్తాము" అని చెప్పారు.అనుమానాస్పద లావాదేవీలను తక్షణమే గుర్తించడానికి పిపిబిఎల్ ఎఐని ఉపయోగిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొంది.


ఇలాంటి మోసలు చేసే వారిని ఇంకా సమాజంలో జరిగే ఆన్ లైన్  మోసాలను దృష్టిలో ఉంచుకుని AI ప్రత్యేకంగా రూపొందించారు. అందువల్ల వినియోగదారుడి ఖాతాలపై ఎలాంటి ఆన్ లైన్ మోసాలు జరకుండా AI ఎదుర్కోగలదు ”అని పేటి‌ఎం తెలిపింది.ప్రతి వినియోగదారుడి లావాదేవీల భద్రతను నిర్ధారించడానికి 200 మందికి పైగా సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల బృందాన్ని పేటి‌ఎం బ్యాంకు కలిగి ఉందని చెప్పింది.

మోసపూరిత లావాదేవీలను గుర్తించడం, వాటిని  జరగకుండా ఆపేయడం, వినియోగదారుడికి ఈ విషయాన్ని నివేదించడానికి ఈ బృందాలు అన్ని రాష్ట్ర, కేంద్ర పోలీసు, సైబర్-సెల్‌లతో పాటు టెలికాం కంపెనీలతో కలిసి పని చేస్తాయి.