అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. టెలికమ్యూనికేషన్స్, టెక్నాలజీ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం. ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్‌కు మొట్టమొదటి ఎలక్ట్రానిక్ సందేశాన్ని 1969లో పంపించారు.

కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా విధించిన దేశ లాక్ డౌన్  సమయంలో ప్రజలకు ఇంటర్నెట్ ఎంతో సహాయపడింది. కరోనా వ్యాప్తి నివారించడానికి సామాజిక దూరం పాటించడానికి ప్రజలు ఆన్ లైన్ లావాదేవీలు ఎక్కువ ఆధారపడుతున్నారు.

మార్చ్ నుండి ఆగష్టు వరకు విధించిన లాక్ డౌన్ కాలంలో ఇంటర్నెట్‌ను ఉపయోగించే వారి సంఖ్య భారీగా పెరిగినప్పటికీ సోషల్ మీడియా, ఆన్‌లైన్‌లో సగటు వినియోగదారులు గడిపిన సమయం కూడా పెరిగింది.

also read త్రీ స్టేజెస్ ఫిల్టరైజేషన్ సిస్టంతో షియోమి ఎం‌ఐ వాటర్ ప్యూరిఫైయర్.. ...

ఇప్పుడు ప్రతి ఇంటిలో వినోదం, వ్యాపారం నుండి ఉద్యోగాలు, ఆర్థిక లావాదేవీల వరకు ఇంటర్నెట్ అధికంగా ఉపయోగిస్తున్నారు. లాక్ డౌన్ ముందు నుండే పెద్ద సంఖ్యలో ప్రజలు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నప్పటికి, లాక్ డౌన్ తర్వాత ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది.  

లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారు కూడా ఇంటర్నెట్ ద్వారా ఉపాధి కోసం చూస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగం కోసం వారు  ఆఫీసుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు.

కొత్త స్టార్టప్‌ను ప్రారంభించే వారు వస్తువులు లేదా సేవలను విక్రయించడానికి మార్కెట్‌లోకి తిరగాల్సిన అవసరం కూడా లేదు. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ద్వారా లాక్‌డౌన్ సమయంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.

ఇది కాకుండ పిల్లల చదువు కోసం డిజిటల్ ప్లాట్‌ఫాంపై ఆన్ లైన్ క్లాసెస్, ఉద్యోగుల కోసం వర్చువల్ మీటింగ్  కి వేగవంతమైన ఇంటర్నెట్ వినియోగం కూడా పెరిగింది. వీటన్నిటి కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లకు మొగ్గు చూపుతున్నారు.

బిఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు ఇతర పెద్ద కంపెనీలు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లను తక్కువ ధరకే అధిక డాటాతో పాటు ఇతర ప్రయోజనాలను కూడా  అందిస్తున్నాయి.