చైనా సంస్థ షియోమి కొత్త ఎం‌ఐ వాటర్ ప్యూరిఫైయర్ హెచ్1000జిని ప్రవేశపెట్టింది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ డబుల్ ఆర్‌ఓ రివర్స్ ఓస్మోసిస్ ఫిల్ట్రరైజెషన్ టెక్నాలజీతో వస్తుంది. నీటి శుద్దీ సామర్థ్యంలో ఇది బలమైనది, నీటి ఉత్పత్తిలో వేగంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ఎం‌ఐ  వాటర్ ప్యూరిఫైయర్ హెచ్ 1000జి కేవలం ఒక నిమిషంలో 2.5 లీటర్ల నీటిని శుద్ధి చేయగలదని షియోమి పేర్కొంది. మెరుగైన వాటర్ ప్యూరిఫయ్ కోసం డబుల్ ఆర్‌ఐ లేయర్ కు అదనంగా వాటర్ ప్యూరిఫైయర్ లో మూడు-దశల ఫిల్టరైజేషన్ ఉంది.

ఎం‌ఐ వాటర్ ప్యూరిఫైయర్ హెచ్1000జి ధర
ఎం‌ఐ వాటర్ ప్యూరిఫైయర్ హెచ్1000జి ధర చైనాలో సిఎన్‌వై 3,999 (ఇండియాలో సుమారు రూ. 43,900). సింగిల్ వైట్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. నవంబర్ 1 నుండి సేల్స్ ప్రారంభమవుతాయి.

ముందస్తుగా కొనుగోలు చేయాలనుకునే వారి కోసం సిఎన్‌వై 2,999 (ఇండియాలో సుమారు రూ. 32,900) పరిచయ ధరతో  ప్యూరిఫైయర్‌ను కొనుగోలు చేయవచ్చు. షియోమి యుపిన్ సైట్ ఇప్పటికే ఎం‌ఐ  వాటర్ ప్యూరిఫైయర్ హెచ్ 1000జి బూకింగ్స్ కూడా ప్రారంభించింది.

also read ఫేస్‌బుక్ ఇండియా పాలసీ హెడ్ అంఖిదాస్ రాజీనామా.. ...

ఎం‌ఐ వాటర్ ప్యూరిఫైయర్ హెచ్1000జి ఫీచర్లు
ఎం‌ఐ వాటర్ ప్యూరిఫైయర్ హెచ్1000జి డబుల్ ఆర్‌ఓ రివర్స్ ఓస్మోసిస్ ఫిల్ట్రేషన్ టెక్నాలజీతో వస్తుంది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ లో మూడు సంవత్సరాల దీర్ఘకాలిక ఫిల్టర్‌ ఉంది, ఒక నిమిషంలో 2.5 లీటర్ల నీటిని శుద్ధి చేయగలదు.

ఇందులో మూడు దశల  ఫిల్టరైజేషన్ సిస్టం ఉంది. ఇది తుప్పు, చెడు వాసన, మెగ్నీషియం, కాల్షియం, క్లోరిన్ వంటి వాటిని తొలగిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులోని మూడు ఫిల్టర్లు పిపి కాటన్, ప్రీ-యాక్టివేటెడ్ కార్బన్ షీట్స్, ఆర్‌ఓ మెంబ్రేన్, ఇన్హిబిటర్ షీట్‌లతో తయారు చేయబడింది.

నీటి నాణ్యత మార్కెట్లో లభించే ప్యాకేజీ బాటిళ్ల నీటితో సమానమని షియోమి పేర్కొంది. ఫిల్టర్ చేసిన నీరు రుచిగా, స్పష్టంగా, తీయగా ఉంటాయని తెలిపింది.

ఎం‌ఐ వాటర్ ప్యూరిఫైయర్ హెచ్1000జిపైన ఓ‌ఎల్‌ఈ‌డి స్క్రీన్ ఇండికేటర్ ఇచ్చారు. ఇది ఆన్ లో ఉన్నప్పుడూ, పనిచేస్తున్నప్పుడు, ఫిల్టర్ స్టేటస్ వంటివి చూపిస్తూతుంది. ఫిల్టర్ ఛేంజ్ రిమైండర్‌లను కూడా అందిస్తుంది.

ఇందులోని ఫిల్టర్లను  మార్చడానికి టెక్నికల్ నిపుణుల అవసరం లేకుండా వినియోగదారులు సులభంగా మార్చవచ్చు. దీనికి వాటర్ లీకేజీ ప్రొటెక్షన్ కూడా ఉన్నట్లు తెలిపింది.