ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ పనిచేయడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్య కొంతమంది వినియోగదారులకు మాత్రమే అని అందరికీ కాదు తెలుస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై  వైఫల్యాల గురించి ఫిర్యాదు చేయడంతో పాటు మీమ్స్, రియాక్షన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ట్రోల్ చేస్తున్నారు.

#Instagramdown అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. చాలామంది ఆండ్రాయిడ్ వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్  యాప్ క్రాష్ అవుతోందని పోస్ట్ చేశారు.

ట్విట్టర్‌లో అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఇప్పటివరకు అంతరాయం గురించి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు, కానీ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ కావడంతో ఇది విస్తృతమైన సమస్య అని స్పష్టం చేస్తుంది. డౌన్‌డెక్టర్‌లోని వెబ్‌సైట్ స్టేటస్ ట్రాకర్స్ ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల నుండి  8 గంటల మధ్య  డౌన్ అయినట్లు తెలుస్తుంది. 

also read ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ నేడే ప్రారంభం: స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, టీవీలపై బెస్ట్ ఆఫర్లు...

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో పాటు వాట్సాప్, మెసెంజర్ వంటి ఇతర ఫేస్‌బుక్ యాప్స్ యూసర్లు కూడా ఈ నెల ప్రారంభంలో అంతరాయన్ని ఎదురుకొన్నారు. ఈ అంతరాయలు ఎక్కువగా  ఐరోపాలోని చాలా ప్రాంతాల్లో నివేదించబడింది, కాగా ఇది ఇతర ప్రాంతాల యూసర్లను  కూడా ప్రభావితం చేసింది.

ఇమేజ్ షేరింగ్ సోషల్ నెట్‌వర్క్ ఇన్‌స్టాగ్రామ్ కూడా ఈ వారంలో అంతరాయాలను ఎదుర్కొన్న ప్రముఖ ప్లాట్‌ఫామ్‌ల జాబితాలో చేరింది. ఈ వారం ప్రారంభంలో టెక్ దిగ్గజం గూగుల్, నెట్‌ఫ్లిక్స్ కూడా  అంతరాయాన్ని ఎదురుకొన్నాయి. ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ కూడా గురువారం అంతరాయాన్ని ఎదుర్కొంది.

ఈ యాప్స్ అంతరాయాలకు ఏవైనా సాధారణ కారణాలు ఉన్నాయో లేదో స్పష్టంగా లేనప్పటికి ఆటోమేటెడ్ కోటా మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో సమస్య కారణంగా అంతరాయం కలిగిందని గూగుల్ తెలిపింది. ఇతర కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్‌లలో సమస్యలకు కారణమైన వాటి గురించి ఇప్పటివరకు వివరాలు వెల్లడించలేదు.