ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2020 తీసుకొచ్చింది. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్పీకర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై భారీ డీల్స్ తో  ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2020 సేల్ ద్వారా అందిస్తుంది.

మీరు ఈ సంవత్సరం అతిపెద్ద ఫెస్టివల్ సీజన్ సేల్ కోల్పోతే లేదా గొప్ప న్యూ ఇయర్ గిఫ్ట్ కోసం చూస్తున్నట్లయితే ఈ సేల్ మీకు డిస్కౌంట్ ధరకే పొందేందుకు మంచి అవకాశం ఇస్తుంది.

సేల్ సమయంలో 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ (కార్డుకు రూ. 1,500 వరకు) కోసం ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బిఐ కార్డులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2020 సేల్ లో అందుబాటులో ఉన్న కొన్ని డీల్స్, ఆఫర్‌ వివరాలు మీకోసం..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో మొబైల్ ఫోన్‌లపై  బెస్ట్ ఆఫర్లు
పోకో ఎక్స్ 3 ధర రూ .15,999(ఎంఆర్‌పి రూ. 19,999). మీ పాత స్మార్ట్‌ఫోన్‌నుతో మార్చుకుంటే రూ.13,200లకు లభిస్తుంది.

also read  అమేజ్‌ఫిట్ జిటిఆర్ 2 స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌వాచ్.. రెండు వెరీఎంట్లలో అందుబాటులోకి.. ...

ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ఆర్ 
 ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ఆర్ ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో  రూ .38,999 (ఎంఆర్‌పి రూ .47,900).  

ఐఫోన్ 11 ప్రో 
 ఆపిల్  ఐఫోన్ 11 ప్రో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2020లో రూ.79,999 (ఎంఆర్‌పి రూ.1,06,600).  ఎస్‌బిఐ కార్డుపై 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా  పొందవచ్చు.

ఎల్జీ జి8 ఎక్స్
ఎల్జీ జి8 ఎక్స్ ఫ్లిప్‌కార్ట్  బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా దీని ధర రూ .25,990 (ఎంఆర్‌పి రూ .70,000).  

ఆసుస్ రోగ్ ఫోన్ 3  
ఆసుస్  రోగ్ ఫోన్ 3 గేమింగ్ స్మార్ట్‌ఫోన్ ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో రూ. 44,999 (ఎంఆర్‌పి రూ.55,999). ఫ్లిప్‌కార్ట్ బండిల్డ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2020 సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై ఉత్తమ ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించింది. ఆపిల్ హోమ్‌పాడ్ స్మార్ట్ స్పీకర్ ధర ఈ సేల్ లో రూ.16,900(ఎంఆర్‌పి రూ.19,900)కే లభిస్తుంది. వివోబుక్ 14 ల్యాప్‌టాప్ ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.40,990(ఎంఆర్‌పి రూ.54,990).  

మీరు పెద్ద స్క్రీన్ టీవీని కొనాలని చూస్తుంటే శామ్‌సంగ్ 55-అంగుళాల స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీని(యుఎ 55 టియు 8000 కెఎక్స్ఎక్స్ఎల్) సేల్ లో రూ.62,590(ఎంఆర్‌పి రూ .86,900)కి లభిస్తుంది. ఎస్‌బిఐ కార్డుదారులు 10 శాతం(రూ.1,500 వరకు) అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్స్ పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్ అందిస్తుంది.