Asianet News TeluguAsianet News Telugu

భారత ఐటీ రంగానికి కష్టాలు.. ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగాల కోత..

కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న ఐటీ రంగం కూడా కుదుపులకు గురవుతున్నది. దాని ప్రభావం భారత ఐటీ రంగంపైన పడుతున్నది. ఖర్చులు తగ్గించుకోవడానికి సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి ఇండియన్ ఐటీ సంస్థలు.

Indias IT Sector May See Mass Layoffs  soon
Author
Hyderabad, First Published Jul 8, 2020, 1:37 PM IST


న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనా వైరస్‌ మహమ్మారి వణికిస్తున్న క్రమంలో లక్షల మందికి ఉపాథి కల్పించే ఐటీ పరిశ్రమ భారీ కుదుపులకు లోనవుతున్నది. మహమ్మారి వ్యాప్తితో డిమాండ్‌ కొరవడిన కారణంగా పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను మూకుమ్మడిగా తొలగించడం ఆందోళన రేకెత్తిస్తోంది. 

రాబోయే రోజుల్లో డిమాండ్‌ మెరుగుపడనిపక్షంలో భారత్‌లో సైతం ఇదే పరిస్థితి నెలకొంటుందని ఐటీ నిపుణుల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే ఐటీ దిగ్గజ సంస్థలు సామర్థ్యం కనబర్చని ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నామని చెబుతున్నారు. 

మరికొన్ని ఐటీ కంపెనీలు ప్రాజెక్టులు లేవంటూ సిబ్బందిని వదిలించుకుంటున్నాయి. కరోనా వైరస్‌తో వ్యాపార వాతావరణం కుదురుగా లేకపోవడం, నూతన ప్రాజెక్టులు రాకపోవడంతో ఐటీ కంపెనీలు ఉద్యోగుల ఉద్వాసనకు దిగాయని చెబుతున్నారు.

also read   ఆరోగ్యసేతు యాప్ వాడుతున్నారా అయితే మీకో గుడ్ న్యూస్... ...

తాజా ప్రాజెక్టులు కొనసాగడంపైనా స్పష్టత లేకపోవడంతో కొలువుల కోతకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఆటోమేషన్‌తో పలు కంపెనీలు ఉద్యోగులను తగ్గించే పనిలో పడగా తాజాగా కోవిడ్‌-19తో ఈ పనిని మరింత వేగంగా ఐటీ కంపెనీలు ముందుకు తీసుకువెళుతున్నాయి.

ఐబీఎం కార్పొరేషన్‌ ప్రపంచవ్యాప్తంగా 2000 మంది ఉద్యోగులపై వేటు వేయనుందని వార్తలు వచ్చాయి. ఈ జాబితాలో భారత్‌లో​ పనిచేసే ఉద్యోగులూ ఉండే అవకాశం ఉంది. ఉద్యోగుల తొలగింపుపై ఐబీఎం ఇంకా నోరు మెదపలేదు. 

మరో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ ఇటీవలే భారత్‌లో పలువురు ఉద్యోగులను తొలగించడాన్ని గుర్తుచేస్తూ ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చితికి ఈ పరిణామాలు సంకేతమని చెబుతున్నారు. కోవిడ్‌-19తో లేఆఫ్స్‌ ఉండవని ఐటీ కంపెనీలు చెబుతున్నా ఐటీ సేవల డిమాండ్‌ ఇలాగే కొనసాగితే సామర్థ్యం ఆధారంగా ఉద్యోగులను కుదించే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios