Asianet News TeluguAsianet News Telugu

ఆరోగ్యసేతు యాప్ వాడుతున్నారా అయితే మీకో గుడ్ న్యూస్...

చాలా రోజుల నుంచి ఆరోగ్య సేతు యాప్ ద్వారా వారి డేటా దుర్వినియోగం అవుతుందేమో అని చాలా మంది ఆలోచిస్తున్నారు. మరి కొంత మందికి డాటా విషయంలో ఈ యాప్ పై అనుమానాలు కూడా ఉన్నాయని వ్యక్తం చేస్తున్నారు. 

Aarogya Setu app has been updated with two new options
Author
Hyderabad, First Published Jul 7, 2020, 6:31 PM IST

ఆరోగ్య సేతు యాప్ వాడేవారికి ఒక గుడ్ న్యూస్. ఇపుడు ఆరోగ్య సేతు యాప్ లో రెండు కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. చాలా రోజుల నుంచి ఆరోగ్య సేతు యాప్ ద్వారా వారి డేటా దుర్వినియోగం అవుతుందేమో అని చాలా మంది ఆలోచిస్తున్నారు. మరి కొంత మందికి డాటా విషయంలో ఈ యాప్ పై అనుమానాలు కూడా ఉన్నాయని వ్యక్తం చేస్తున్నారు.

భారతదేశానికి చెందిన అధికారిక కోవిడ్ 19 కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ రిలీజ్ అయినప్పటి నుంచి యూజర్ల డేటాపై అనుమానాలు ప్రచారం అవుతునే ఊన్నాయి. దీంతో యాప్ డెవలపర్లు మరో నిర్ణయం తీసుకున్నారు. యూజర్లు తమ అకౌంట్‌ను శాశ్వతంగా డిలిట్ చేసే అవకాశాన్ని ఇస్తున్నారు. ఆరోగ్య సేతు యాప్ డిలెట్ చేశాక మీ డేటా ప్రభుత్వ సర్వర్‌లో 30 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మీ ఆరోగ్య స్టేటస్ ని  ఇతర యాప్స్ కి  అనుమతి ఇచ్చే ఆప్షన్ తో ఆరోగ్య సేతు యాప్ ని ఆప్ డేట్ చేశారు. ఇది వినియోగదారులు తమ ఖాతాను శాశ్వతంగా డిలెట్ చేయడానికి, ఆరోగ్యా సేతు యాప్ ద్వారా స్టోర్ చేసిన వారి మొత్తం డేటాను డిలెట్ చేసేందుకు ఒక కొత్త ఆప్షన్ జోడించింది.

కాంటాక్ట్-ట్రేసింగ్ యాప్ అభివృద్ధి బృందం కరోనా వైరస్ తో సంబంధం ఉన్న ప్రమాద స్థాయిని అంచనా వేయడానికి బ్లూటూత్ కాంటాక్ట్స్ ఉపయోగించే సామర్థ్యాన్నికూడా జోడించినట్లు ప్రకటించింది. ఇందుకోసం ఆండ్రాయిడ్,  ఐ‌ఓ‌ఎస్ డివైజెస్ కోసం ఆరోగ్య సేటు యాప్ లో కొత్త మార్పులు చేశారు.

also read ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాంకి పోటీగా ఇండియన్ యాప్ వచ్చేసింది.. ...

యాప్ అప్ డేట్ చేసిన వారికి ఆరోగ్య సేతు యాప్ లో లభించే కొత్త మార్పులలో ఒకటి మీ ఆరోగ్య స్టేటస్ మూడవ పార్టీ యాప్స్ లకు అనుమతి ఇచ్చే ఆప్షన్. ఆరోగ్య సేతు స్టేటస్ కోసం సెట్టింగులలో అప్రూవల్ ఫర్ ఆరోగ్య్త సేతు స్టేటుస్ అనే కొత్త ఆప్షన్ చూడొచ్చు.

ఇది ఆరోగ్యా సేతు యాప్ నుండి మీ ఆరోగ్య స్టేటస్ ని ఇతర యాప్స్ లకు  అక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. రెండవ మార్పు ఏంటంటే ఆరోగ్యా సేతు యాప్ లో మీ ఖాతాను శాశ్వతంగా  డిలెట్ చేసే ఆప్షన్. మీరు మీ ఖాతాను డిలెట్ చేయాలనుకుంటే లేదా మీ ఫోన్ నుండి మీ  యాప్ డేటాను డిలెట్ చేయడానికి ఒక కొత్త  ఆప్షన్ చూస్తారు.

ఈ క్రొత్త ఆప్షన్ ఆండ్రయిడ్ డివైజెస్ కోసం అందుబాటులో ఉంది, అయితే ఐ‌ఓ‌ఎస్ డివైజెస్ లో మాత్రం  డిలెట్_అకౌంట్_టైటిల్ గా కనిపిస్తుంది. ఆరోగ్య సేతు యాప్ ఆండ్రాయిడ్ వెర్షన్‌లో అందించిన మీ వివరాలు అకౌంట్ డిలిట్ చేశాక డేటా శాశ్వతంగా ఫోన్ నుంచి డిలిట్ అవుతుంది.

కానీ ప్రభుత్వ డాటా సర్వర్లలో 30 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత ఆటోమేటిక్ గా డిలెట్ అవుతుంది. మీరు డిలెట్ మై అకౌంట్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత, తొలగింపు ప్రక్రియను పూర్తి చేయడానికి మీరు మీ మొబైల్ నంబర్‌ను అందించాల్సి ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios