Asianet News TeluguAsianet News Telugu

విపణిలోకి వివో మరో పంచ్​ హోల్​ సెల్ఫీ ఫోన్​.. ధరెంతంటే?

వివో నుంచి మరో ప్రీమియం స్మార్ట్​ఫోన్ భారత మార్కెట్లోకి రానుంది. వివో 'వీ17' ప్రోకి కొనసాగింపుగా.. 'వీ17' పేరుతో ఈ మోడల్​ను​ విడుదల చేయనుంది. 

Indian vivo V17 to feature a punch hole display and L-shaped quad camera
Author
New Delhi, First Published Dec 1, 2019, 2:54 PM IST

భారత మార్కెట్లోకి వివో మరో సరికొత్త స్మార్ట్​ ఫోన్​ను విడుదల చేయనుంది. వివో 'వీ' శ్రేణిలో కొత్త ఫోన్​ను తేనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మీడియా సంస్థలకు ఆహ్వానాలు పంపింది. వీటి ప్రకారం డిసెంబర్​ 9వ తేదీన వివో 'వీ17' పేరుతో కొత్త మోడల్​ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు స్పష్టం అవుతోంది. 

సెప్టెంబర్​లో వచ్చిన వివో 'వీ17 ప్రో'కి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్​ను మార్కెట్లోకి ఆ సంస్థ తీసుకు రానున్నది. 'వీ17' గురించి పెద్దగా వివరాలేవి బయటికి వెల్లడించలేదు. అయితే 'వీ17' పేరుతో రష్యాలో కొత్త మోడల్​ను వివో విడుదల చేసింది.

Also read:డిసెంబర్ 10న రెడ్​మీ '5జీ' స్మార్ట్​ఫోన్ లాంచ్... రెండు కొత్త ఫీచర్లతో...

భారత్​లో విడుదలయ్యే 'వీ17' మోడల్​కు రష్యా మోడల్​కు కొన్ని ఫీచర్లు మినహాయించి.. చాలా వ్యత్యాసం ఉండనున్నది. ఎందుకంటే రష్యాలో విడుదలైన 'వీ 17' మోడల్​కు టియర్​ డ్రాప్​ నాచ్​ సెల్ఫీ కెమెరా ఉంది. 

భారత్​లో విడుదలయ్యే 'వీ 17' మోడల్​ వివో 'జెడ్​1' ప్రో మాదిరే పంచ్​ హోల్​ సెల్ఫీ కెమెరా ఉన్నట్లు ఆ సంస్థ విడుదల చేసిన టీజర్​ ద్వారా తెలిసింది. రష్యాలో విడుదలైన మోడల్​తో పోలిస్తే.. ఇంకా ఎక్కువ ఫీచర్లు ఉండొచ్చని టెక్​వార్తా సంస్థలు పేర్కొన్నాయి. 

ప్రీమియం సెగ్మెంట్​లో వస్తున్న ఈ మోడల్​ ధర భారత్​లో రూ.22 వేలు ఉంటుందని అంచనా. ఈ ఫోన్ 6.38 అంగుళాల డిస్​ప్లే, ఫుల్​ హెచ్​డీ ప్లస్ సూపర్​ అమ్లోడ్​ డిస్​ప్లేతోపాటు 8 జీబీ ర్యామ్​ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంటుంది. 

Also Read:మార్కెట్లోకి విడుదలైన ఫస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్..ధర ఎంతంటే ?

స్నాప్​ డ్రాగన్​ 665 ప్రాసెసర్​తోపాటు బ్యాకప్ నాలుగు కెమెరాలు (48 ఎంపీ+ 8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)తోపాటు 32 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా కలిగి ఉండటంతోపాటు ఆండ్రాయిడ్ 9పై ఓఎస్‌పై పని చేస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios