న్యూ ఢీల్లీ: హై-ప్రొఫైల్ యూసర్లను లక్ష్యంగా చేసుకుని ఇటీవల జరిగిన గ్లోబల్ హాక్ యొక్క పూర్తి వివరాలను మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ను కోరుతూ భారత సైబర్‌ సెక్యూరిటీ నోడల్ ఏజెన్సీ సిఇఆర్టి-ఇన్ నోటీసు జారీ చేసింది.

హ్యాక్ చేసే వారి సమాచారం, హ్యాక్  మోడ్ ఆపరేషన్ గురించి కూడా ప్రభుత్వం డిమాండ్ చేసింది, హ్యాకింగ్ ప్రభావాన్ని తగ్గించడానికి ట్విట్టర్ తీసుకున్న పరిష్కార చర్యల వివరాలను కూడా  కోరింది.

ప్రపంచ కార్పొరేట్ లీడర్లు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపారుల ఖాతాలను హ్యాక్ చేయడానికి ట్విట్టర్ వ్యవస్థకు హ్యాకర్లు ఆక్సెస్ పొందారని నివేదికలు రావడంతో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఇఆర్టి-ఇన్) చర్య తీసుకుంది.

also read నెట్‌ఫ్లిక్స్ బంపర్ ఆఫర్.. వీడియో గేమ్ అడితే 83 ఏళ్లు సబ్ స్క్రిప్షన్ ఫ్రీ.. ...

హ్యాకింగ్ ఘటనలో భారతీయులకు చెందిన ఎన్ని అకౌంట్లు హ్యాకింగ్ కు గురయ్యాయో వెల్లడించాలని ఆ నోటీసులో సెర్ట్ ఇన్ ఆదేశించింది. అలాగే, ఈ సంఘటనతో ఎలాంటి సమాచారం ప్రభావితమైందో కూడా చెప్పమని ట్విట్టర్ ను కోరింది.

హానికరమైన ట్వీట్లు, లింక్‌లను ఎంతమంది భారతీయ వినియోగదారులు సందర్శించారని, వారి ప్రొఫైల్‌ల ఉల్లంఘన , అనధికారిక ఉపయోగం గురించి బాధిత వినియోగదారులకు తెలియజేశారా అని సెర్ట్ ఇన్ ట్విట్టర్‌ను అడిగినట్లు ఆ వర్గాలు తెలిపాయి.

అయితే ట్విట్టర్ నుండి  స్పందన లేదని తెలిసింది. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ ఫ్రంట్ రన్నర్ జో బిడెన్‌తో పాటు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, టెస్లా సీఈఓ ఎలోన్‌ మాస్క్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హై ప్రొఫైల్ యూసర్ల ట్విట్టర్ ఖాతాలను సైబర్ దాడి చేశారు.