అవును, మీరు విన్నది నిజమే. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్  మీకు ఇప్పుడు 83 సంవత్సరాల సబ్ స్క్రిప్షన్ అందించేందుకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది, ఇది కూడా పూర్తిగా ఉచితంగా. మరో మాటలో చెప్పాలంటే నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు 1,000 నెలల సబ్ స్క్రిప్షన్ అదనపు ఖర్చు లేకుండా అందిస్తుంది.

ఈ ఆఫర్‌ను పొందడానికి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం వినియోగదారులు “ది ఓల్డ్ గార్డ్” వీడియోగేమ్  ఆడి అందులో అత్యధిక పాయింట్లు సాధించాలని తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ ది ఓల్డ్ గార్డ్ మూవీని గత వారం తన ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేసింది. దీనిని చూడడానికి వినియోగదారులకు “ఇమ్మోర్టల్” నెట్‌ఫ్లిక్స్ ఖాతాను కూడా  అందిస్తోంది.

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం దీనిని ఇమ్మోర్టల్ అక్కౌంట్ అని పిలుస్తోంది ఎందుకంటే దీని ద్వారా 83 సంవత్సరాల నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది. 1000 వారాల పాటు సబ్ స్క్రిప్షన్ పొందడానికి మీరు చేయాల్సిందల్ల ఓల్డ్ గార్డ్ గేమ్‌ను ఆడటం, అందులో అత్యధిక పాయింట్లు సాధించడం.

also read అమెజాన్ ఆపిల్‌ డేస్‌ సేల్‌ : తక్కువ ధరకే ఐఫోన్స్.. ... ​​​​​​​

వీడియో గేమ్‌కు ఆక్సెస్ పొందడానికి http://www.oldguardgame.com/ ని సందర్శించండి. ఓల్డ్ గార్డ్ గేమ్ బ్రౌజర్ ఆధారితమైనది. వీడియో గేమ్‌లో మీరు ప్రధాన పాత్రగా ఆడవలసి ఉంటుంది. ఒక డబుల్ బ్లేడెడ్ గొడ్డలి, లాబ్రిస్‌ని ఉపయోగించి వీలైనంత ఎక్కువ మంది శత్రువులను చంపాలి.

గేమ్ ఆడుతున్నప్పుడు మీరు చనిపోతున్నారా లేదా ఇతర ఆటగాళ్లతో పోల్చితే  గేమ్ మందగించకుండ మీరు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు గేమ్ ఆడటంలో జాగ్రత్తగా వహించాలి. ఈ ప్రక్రియలో మీరు దెబ్బతినకుండా లేదా చంపబడకుండా ఉండాలి.

నెట్‌ఫ్లిక్స్ ఇమ్మోర్టల్ గేమ్ ఇప్పుడు అందుబాటులో ఉంది. జూలై 19 వరకు ఆక్టివ్ గా ఉంటుంది. చెప్పినట్లుగా, ఎవరైతే  అత్యధిక పాయింట్లు సాధిస్తారో  వారికి 83 సంవత్సరాల పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఇవ్వబడుతుంది. అయితే ఈ పోటీ భారతదేశంలో కాకుండా అమెరికాలోని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.