అమేజ్‌ఫిట్ ఇండియా కొత్త స్మార్ట్‌వాచ్ అమాజ్‌ఫిట్ జిటిఆర్ 2ను ఇండియాలో లాంచ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమేజ్‌ఫిట్ జిటిఆర్ 2 సేల్స్ ప్రారంభమయ్యాయి. అమేజ్‌ఫిట్ జిటిఆర్ 2 క్లాసిక్ లుక్, కర్వ్డ్ రౌండ్ డయల్‌తో పరిచయం చేశారు.

అమేజ్‌ఫిట్ జిటిఆర్ 2 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది, వాటిలో ఒకటి స్పోర్ట్ ఎడిషన్ దీని ధర రూ.12,999, రెండవది క్లాసిక్ ఎడిషన్ దీని ధర రూ.13,499. 

also read స్టీరియో స్పీకర్లు, 128 జీబీ స్టోరేజ్ తో కొత్త రెడ్‌మి 9 పవర్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే.. ...

అమేజ్‌ఫిట్ జిటిఆర్ 2 స్పెసిఫికేషన్లు 
అమేజ్‌ఫిట్ జిటిఆర్ 2లో 3డి కర్వ్డ్ గ్లాస్, మెటల్ వాచ్ కేస్‌తో 1.39 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ వాచ్ డిస్‌ప్లే లైట్ 450 నిట్స్. డిస్‌ప్లేలో యాంటీ ఫింగర్ ప్రింట్ లేయర్, ఆప్టికల్ డైమండ్ లాంటి కార్బన్ (ODLC) లేయర్ తో  3డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అందించారు.

ఈ వాచ్ లో 50 వాచ్ ఫెసెస్ ఉన్నాయి. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఈ వాచ్ లో ఎల్లప్పుడూ డిస్ ప్లే ఆన్ లో ఉంటుంది. అమేజ్‌ఫిట్ జిటిఆర్ 2 లో 471 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ అమర్చారు, దీనితో కంపెనీ 14 రోజుల బ్యాకప్‌ను క్లెయిమ్ చేసింది. 50 మీటర్ల లోతులో నీటిలో పడిపోయిన తరువాత కూడా ఈ వాచ్ పాడవదు అని కంపెనీ పేర్కొంది. 

అమేజ్‌ఫిట్ జిటిఆర్ 2 మీ ఫోన్‌లో మ్యూజిక్ ప్లే చేయడానికి అక్సెస్ ఇస్తుంది. ఈ వాచ్ లో 3 జీబీ స్టోరేజ్ ఉంది, దీనిలో మీరు సుమారు 600 పాటలను స్టోర్ చేసుకోవచ్చు. ఈ వాచ్ లో పిపిజి ఆప్టికల్ సెన్సార్, 24 గంటల హార్ట్ బీట్ సెన్సార్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటర్ సెన్సార్స్ ఉన్నాయి.