హువావే మేట్‌ప్యాడ్ టి8 టాబ్లెట్‌ను మేలో ప్రపంచవ్యాప్త లాంచ్ చేసిన తరువాత తాజాగా భారతదేశంలో విడుదల చేశారు. బడ్జెట్-ఫ్రెండ్లీ టాబ్లెట్ 8-అంగుళాల డిస్ ప్లేతో వస్తుంది. హువావే మేట్‌ప్యాడ్ టి8 సింగిల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్, సింగిల్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.

ఇందులో  ఎల్‌టిఇ లేదా వై-ఫై వేరియంట్‌  ఆప్షన్ కూడా అందిస్తుంది. ఆక్టా-కోర్ సిపియుతో పనిచేస్తుంది. వచ్చే వారం నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా  సేల్స్ ప్రారంభంకానుంది.

భారతదేశంలో హువావే మేట్‌ప్యాడ్ టి8 ధర
హువావే మేట్‌ప్యాడ్ టి8 వై-ఫై వేరియంట్‌  ధర 2జి‌బి + 32జి‌బి స్టోరేజ్ వేరియంట్‌కు రూ.9,999 కాగా, అదే స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో ఎల్‌టిఇ మోడల్ ధర రూ. 10,999. సింగిల్ డీప్ సి బ్లూ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి వస్తుంది. ఈ రోజు నుండి సెప్టెంబర్ 14 వరకు టాబ్లెట్ కోసం ప్రీ-ఆర్డర్‌ చేసుకోవచ్చు. 

also  reaad కలర్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేతో రెడ్‌మి కొత్త స్మార్ట్ బ్యాండ్.. రేపే లాంచ్.. ...
 

హువావే మేట్‌ప్యాడ్ టి8 ఫీచర్స్
ఆండ్రాయిడ్ 10 ఆధారంగా హువావే మేట్‌ప్యాడ్ టి8 EMUI 10.0.1 పై నడుస్తుంది. 1,280x800 పిక్సెల్స్ రిజల్యూషన్, 189 పిపి పిక్సెల్ డెన్సిటీతో 8 అంగుళాల ఎల్‌సిడి డిస్‌ప్లే, ఆక్టా-కోర్ మీడియాటెక్ MT8768 SoC, IMG GE8320 GPU, 2జి‌బి ర్యామ్, మైక్రో ఎస్‌డి కార్డ్ (512GB వరకు)  32జి‌బి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది.

హువావే మేట్‌ప్యాడ్ టి8 సింగిల్ 5 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. స్టాండర్డ్ ఛార్జింగ్‌తో 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ, కనెక్టివిటీ ఆప్షన్స్ లో  డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, ఎల్‌టిఇ, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి ఓటిజి, మైక్రో-యుఎస్‌బి పోర్ట్‌  ఉన్నాయి.

 హువావే మేట్‌ప్యాడ్ టి8 199.70x121.10x8.55 ఎం‌ఎం సైజులో, 310 గ్రాముల బరువు ఉంటుంది.