బడ్జెట్ ధరకే లేటెస్ట్ ఫీచర్లతో నోకియా 3జిబి స్మార్ట్ ఫోన్..
ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ నుండి వినియోగదారులు ఆశించే పెద్ద స్క్రీన్, ఇతర ఫీచర్లతో బడ్జెట్-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ గా నిలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రిటైలర్ అవుట్‌లెట్లలో, ఆన్‌లైన్ నోకియా.కంలో లభిస్తుంది. నార్డిక్ బ్లూ, సాండ్ కలర్ అనే రెండు ఆప్షన్స్ లో సెప్టెంబర్ 17 నుండి అందుబాటులోకి వస్తుంది.
![HMD Global launches Nokia C3 smartphone; price starts Rs 7499 HMD Global launches Nokia C3 smartphone; price starts Rs 7499](https://static-gi.asianetnews.com/images/01egmtvqyqm1tgy51d52cp0r91/nokia-jpeg_363x203xt.jpg)
ఫిన్నిష్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హెచ్‌ఎండి గ్లోబల్ మంగళవారం నోకియా సి3 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. భారతదేశంలో భారతీయ వినియోగదారుల కోసం తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ మేడ్ ఇన్ ఇండియాగా ప్రవేశించింది.
ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ నుండి వినియోగదారులు ఆశించే పెద్ద స్క్రీన్, ఇతర ఫీచర్లతో బడ్జెట్-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ గా నిలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రిటైలర్ అవుట్‌లెట్లలో, ఆన్‌లైన్ నోకియా.కంలో లభిస్తుంది. నార్డిక్ బ్లూ, సాండ్ కలర్ అనే రెండు ఆప్షన్స్ లో సెప్టెంబర్ 17 నుండి అందుబాటులోకి వస్తుంది.
2జిబి / 16జిబి వెరీఎంట్ ధర వరుసగా 7,499, 3జిబి/32జిబి వెరీఎంట్ ధర 8,999. సెప్టెంబర్ 10 నుండి నోకియా సి3ని నోకియా.కం ద్వారా ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. నోకియా ఆన్‌లైన్ పోర్టల్‌లో లభించే నిబంధనలు, షరతులపై 1 సంవత్సరాపు వారంటీ కూడా వస్తుంది.
also read మొబైల్ సేవల ధరల పెంపు తప్పదు..: నెలకు 1.6 జీబీ మాత్రమే.. ...
నోకియా సి3 స్మార్ట్ ఫోన్ సి-సిరీస్‌ను తదుపరి స్థాయికి తీసుకువెళుతుంది. ఎందుకంటే ఇది మెక్ ఇన్ ఇండియా చొరవతో భారతదేశంలో తయారైన ఫోన్. ఆండ్రాయిడ్ 10, పెద్ద 5.99-అంగుళాల హెచ్‌డి ప్లస్ స్క్రీన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో మీరు ఆశించే అన్ని ఫీచర్స్ ఉన్నాయి అని హెచ్‌ఎండి గ్లోబల్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జుహో సర్వికాస్ అన్నారు.
ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది, వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇతర నోకియా-బ్రాండెడ్ ఫోన్‌లగానే ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్ ఇందులో ఉంది. 3,040 ఎంఏహెచ్ బ్యాటరీతో, వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా సెల్ఫిల కోసం ముందు భాగంలో 5ఎంపి కెమెరా అందించారు.
![left arrow](https://static-gi.asianetnews.com/v1/images/left-arrow.png)
![right arrow](https://static-gi.asianetnews.com/v1/images/right-arrow.png)