బడ్జెట్ ధరకే పెద్ద డిస్‌ప్లేతో రిలీజ్ కానున్న నోకియా లేటెస్ట్ ఫోన్.. ఫీచర్స్ ఏంటంటే ?
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసిన వెంటనే డిసెంబర్ మధ్య నాటికి నోకియా 3.4 ను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. నోకియా పవర్ యూజర్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం హెచ్‌ఎండి గ్లోబల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడానికి నోకియా 3.4ను భారతదేశంలో విడుదల చేయనుంది.
హెచ్‌ఎండి గ్లోబల్‌కు చెందిన నోకియా డిసెంబర్ 2 లేదా 3 వారంలో నోకియా లేటెస్ట్ స్మార్ ఫోన్ 3.4 దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసిన వెంటనే డిసెంబర్ మధ్య నాటికి నోకియా 3.4 ను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.
నోకియా పవర్ యూజర్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం హెచ్‌ఎండి గ్లోబల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడానికి నోకియా 3.4ను భారతదేశంలో విడుదల చేయనుంది. నోకియా 2.4 ధర రూ .10,399, రెడ్‌మి 9 ప్రైమ్, రియల్ మీ 7, కొత్తగా లాంచ్ అయిన మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 లతో ఈ స్మార్ట్ ఫోన్ పోటీపడుతుంది.
3.4 బేస్ వేరియంట్ ధర రూ.10వేల పైనే ధరను నిర్ణయించనుంది. అయితే మల్టిపుల్ స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది, 3 జిబి ర్యామ్‌తో కూడిన బేస్ మోడల్‌కు సుమారు 12వేల రూపాయల ధరకు రిటైల్ చేస్తుందని భావిస్తున్నారు. డిసెంబర్ చివరి నాటికి ప్రీ-ఆర్డర్‌ల కోసం ఫోన్‌ని అందుబాటులోకి తీసుకురావొచ్చు.
నోకియా ఇప్పటికే ఈ ఫోన్‌ను ఎంపిక చేసిన కొన్ని యూరోపియన్ దేశాలలో సెప్టెంబర్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టింది. యూకేలో నోకియా 3.4 ఫోన్ ధర 130 పౌండ్లుకాగా దేశీయంగా సుమారు రూ. 12,000- 12,800 స్థాయిలో ఉండవచ్చని విశ్లేషకుల అంచనా.
also read అమెజాన్ స్మాల్ బిజినెస్ డే.. వంట సామాగ్రి, స్పోర్ట్స్, గృహ ఉత్పత్తుల పై 10% డిస్కౌంట్ కూడా..
నోకియా స్మార్ట్ ఫోన్లలో 2.4 మోడల్, 5.3 మోడళ్ల ధరలు రూ. 10,400- రూ. 12,999 మధ్యలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు మోడళ్ల ధరల మధ్యలో తాజా ఫోన్ 3.4 ధర ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
నోకియా 3.4 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్
నోకియా దేశీ వెబ్‌సైట్ వివరాల ప్రకారం నోకియా 3.4 మోడల్ మూడు కలర్స్‌లో లభ్యంకానుంది. 8ఎంపి ఫ్రంట్ కెమెరా పంచ్-హోల్ కటౌట్‌తో 6.3-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్ ప్లే ఉంది. నోకియా 3.4 లోని వెనుక కెమెరాలలో 13ఎంపి ప్రాధమిక కెమెరా, 5ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా ఉంటాయి.
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 406 ఎస్‌వోసీ ప్రాసెసర్‌తో విడుదల కానుంది. 3 జీబీ ర్యామ్, 64 జీబీ వరకూ అంతర్గత మెమరీను అందించనుంది. మైక్రో ఎస్‌డీకార్డ్ ద్వారా 512 జీబీ వరకూ మెమరీను పెంచుకునే సౌలభ్యం ఉంది.
బ్యాటరీ సామర్థ్యం 4,000 ఎంఏహెచ్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4 జిబి ర్యామ్‌తో 64 జిబి స్టోరేజ్ కూడా అందిస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ తో ఫోన్ లాంచ్ కానుంది, అయితే ఆండ్రాయిడ్ 11 అప్ డేట్ కూడా ఉందని నోకియా తెలిపింది.