Asianet News TeluguAsianet News Telugu

అమెజాన్‌ స్మాల్‌ బిజినెస్‌ డే.. వంట సామాగ్రి, స్పోర్ట్స్, గృహ ఉత్పత్తుల పై 10% డిస్కౌంట్ కూడా..

స్మాల్ బిజినెస్ డే డిసెంబర్ 12 అర్ధరాత్రి నుండి 24 గంటలు ప్రారంభమవుతుంది, అయితే ఇది ప్రత్యేకంగా క్యూరేటెడ్ ఆన్‌లైన్ ఈవెంట్ అవుతుంది. స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తులవారు, స్థానిక దుకాణాలు, చేనేత కార్మికుల నుండి ప్రత్యేకమైన ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశాన్ని వినియోగదారులకు అందిస్తున్నట్లు  ఒక ప్రకటనలో తెలిపింది.

Amazon India will host the fourth edition of its Small Business Day 2020 on Dec 12
Author
Hyderabad, First Published Dec 7, 2020, 1:20 PM IST

 ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా స్మాల్ బిజినెస్ డే 2020 నాల్గవ ఎడిషన్‌ను డిసెంబర్ 12న నిర్వహించనున్నట్లు తెలిపింది. స్మాల్ బిజినెస్ డే డిసెంబర్ 12 అర్ధరాత్రి నుండి 24 గంటలు ప్రారంభమవుతుంది, అయితే ఇది ప్రత్యేకంగా క్యూరేటెడ్ ఆన్‌లైన్ ఈవెంట్ అవుతుంది.

స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తులవారు, స్థానిక దుకాణాలు, చేనేత కార్మికుల నుండి ప్రత్యేకమైన ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశాన్ని వినియోగదారులకు అందిస్తున్నట్లు  ఒక ప్రకటనలో తెలిపింది.

 చిరు వ్యాపారాలకు  వేగవంతమైన వ్యాపార వృద్ధిని కొనసాగించడానికి స్మాల్ బిజినెస్ డే  కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సంవత్సరంలో స్మాల్ బిజినెస్ డే కార్యక్రమం జరగడం ఇది రెండవసారి. గృహ ఉత్పత్తులు, గోడ అలంకరణ, భుజ్ నుండి లిప్పన్ ఆర్ట్ వర్క్, ఛత్తీస్‌ఘడ్ నుండి డోఖ్రా క్రాఫ్ట్ వంటి హాంగింగ్‌లు, వంట సామాగ్రి, స్పోర్ట్స్ ఎసెన్షియల్స్ ఇంకా ఇతర ఉపకరణాలు అందుబాటులో ఉంటాయి.

also read పెద్ద డిస్ ప్లేతో డిసెంబర్ 8న మోటోరోలా జి9పవర్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే ? ...

చిన్న వ్యాపారాలు, సూక్ష్మ వ్యవస్థాపకులను షాపింగ్ చేయడానికి, మద్దతు ఇవ్వడానికి వినియోగదారులను ప్రోత్సహించడానికి అమెజాన్ కస్టమర్ల కోసం డిజిటల్ చెల్లింపులపై 10% క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తుంది. అదనంగా క్రెడిట్ /డెబిట్ కార్డ్ లావాదేవీలపై 10% ఇన్స్టంట్ తగ్గింపును అందించడానికి అమెజాన్ ఐసిఐసిఐ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది.

అమెజాన్ బిజినెస్ కస్టమర్లు ప్రత్యేకమైన బిజినెస్ కస్టమర్-ఓన్లీ ద్వారా 10% క్యాష్‌బ్యాక్, జిఎస్‌టి ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్, బల్క్ డిస్కౌంట్,  బిజినెస్ ఎక్స్‌క్లూజివ్ డీల్స్‌ ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్‌లు, గృహోపకరణాలు, ఇతర సామాగ్రిపై  అదనపు సేవింగ్స్  పొందవచ్చు.
    
 27 జూన్ 2020న జరిగిన స్మాల్ బిజినెస్ డే - యూ‌ఎన్ ఎం‌ఎస్‌ఎం‌ఈ దినోత్సవం సందర్భంగా 2,600 మంది అమ్మకందారులు ఈ స్మాల్ బిజినెస్ డే కార్యక్రమంలో అత్యధిక అమ్మకాలను సాధించారు.

అమెజాన్ కరిగర్ లో భాగమైన చేతివృత్తులవారు, చేనేత కార్మికులు ఈ కార్యక్రమంలో 4.5x వృద్ధిని సాధించారు. సహేలి కార్యక్రమం కింద మహిళా పారిశ్రామికవేత్తలు 5x వృద్ధిని సాధించారు. అదేవిధంగా లాంచ్‌ప్యాడ్ ప్రోగ్రాం కింద బ్రాండ్లు, స్టార్టప్‌లు వారి సగటు అమ్మకాల కంటే 1.6X పెరిగాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios