ఫ్లిప్ కెమెరాతో ఆకట్టుకుంటున్న ఆసుస్ స్మార్ట్ ఫోన్లు..
7-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు మోటరైజ్డ్ ఫ్లిప్ కెమెరాతో వస్తాయి, గత సంవత్సరం జెన్‌ఫోన్ 6 అకా, ఆసుస్ 6 జెడ్‌లో ఉండే కెమెరా సిస్టమ్ లాగానే పనిచేస్తుంది.
తైవాన్ చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆసుస్ రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. రెండు కొత్త జెన్‌ఫోన్లు 7-సిరీస్ కింద జెన్‌ఫోన్ 7, జెన్‌ఫోన్ 7 ప్రోలను తీసుకొచ్చింది. 7-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు మోటరైజ్డ్ ఫ్లిప్ కెమెరాతో వస్తాయి, గత సంవత్సరం జెన్‌ఫోన్ 6 అకా, ఆసుస్ 6 జెడ్‌లో ఉండే కెమెరా సిస్టమ్ లాగానే పనిచేస్తుంది.
జెన్‌ఫోన్ 7, జెన్‌ఫోన్ 7 ప్రో కూడా 90 హెర్ట్జ్ అమోలేడ్ డిస్‌ప్లేతో వస్తాయి. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదనంగా కొత్త ఆసుస్ స్మార్ట్‌ఫోన్‌లకు 5జి సపోర్ట్ కూడా ఉంది.
జెన్‌ఫోన్ 7 స్పెసిఫికేషన్లు: 6.67 అంగుళాలు డిస్‌ప్లే, 64+12+8 మెగా పిక్సల్ రియర్ కెమెరా, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 5000mAh బ్యాటరీ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 10 ఓఎస్
also read వచ్చేస్తోంది ఫేస్‌బుక్ న్యూస్.. ఇండియాలో వారికి కంటెంట్‌కు తగ్గ పేమెంట్లు కూడా.. ...
జెన్‌ఫోన్ 7 ప్రొ స్పెసిఫికేషన్లు: 6.67 అంగుళాలు డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్, 64+12+8 మెగా పిక్సల్ రియర్ కెమెరా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, 5000mAh బ్యాటరీ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 10 ఓఎస్
6జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర TWD 21,990 (సుమారు రూ. 55,700 ఇండియాలో) గా నిర్ణయించింది, 8జీబీ + 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర TWD 23,990 (సుమారు రూ .60,100).
మరోవైపు, ఆసుస్ జెన్‌ఫోన్ 7 ప్రో మాత్రం సింగిల్ వెరీఎంట్ 8జిబి + 256 జిబి స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది, దీని ధర టిడబ్ల్యుడి 27,990 (సుమారు రూ. 71,000). జెన్‌ఫోన్ 7 మరియు జెన్‌ఫోన్ 7 ప్రో రెండూ తైవాన్‌లో త్వరలో కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.