ప్రపంచవ్యాప్తంగా జిమెయిల్, యూట్యూబ్, గూగుల్ డాక్స్ తో సహ అన్నీ డౌన్.. కారణం ఏంటంటే ?

 జిమెయిల్, యూట్యూబ్, డాక్స్ తో సహా ఇతర సర్వీస్ సోమవారం మధ్యాహ్నం అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. గూగుల్ వెబ్‌పేజీలు ఎర్రర్ పేజీకి మళ్ళించబడుతున్నాయని సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియా పోస్టులు చేశారు. 

Gmail YouTube Google Docs face simultaneous global outage users faces error

ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్ కి చెందిన జిమెయిల్, యూట్యూబ్, డాక్స్ తో సహా ఇతర సర్వీస్ సోమవారం మధ్యాహ్నం అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. గూగుల్ వెబ్‌పేజీలు ఎర్రర్ పేజీకి మళ్ళించబడుతున్నాయని సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియా పోస్టులు చేశారు.

ఒక నివేదిక ప్రకారం, గూగుల్ వెబ్‌పేజెస్ లో సమస్యలు సాయంత్రం 5 గంటలకు నుండి ఎదుర్కొంటున్నట్లు, ఈ అంతరాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ వినియోగదారులు నివేదించారు.

 

గూగుల్‌లో ఏదైనా సర్చ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు "ఎర్రర్ 500" అంటూ చూపిస్తుందని కొందరు యూజర్లు సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించారు. చాలా మందికి “ఎర్రర్ కారణంగా దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి” అంటూ డిస్ ప్లే లో చూపిస్తుంది  అంటూ నివేదించారు.

also read  త్వరలో నోకియా కొత్త ల్యాప్‌టాప్ లాంచ్.. 11 ఏళ్ళ తరువాత మళ్లీ మార్కెట్లోకి.. ...

యూట్యూబ్ హోమ్‌పేజీలో కూడా ‘సం థింగ్ వెంట్ రాంగ్ ...’ అని ఎర్రర్ చూపించగా, జిమెయిల్ లో ‘ఊప్స్… సిస్టమ్ ఎంకౌంటరేడ్ ప్రబ్లెమ్(# 2014)’ అంటూ చూపించింది. గూగుల్ డ్రైవ్ యాప్స్  డాక్స్, షీట్స్ మొదలైనవి కూడా పనిచేయలేదు.

‘గూగుల్ డాక్స్ ఎర్రర్ ఎదురుకొంటుందని  దయచేసి ఈ పేజీని మళ్లీ లోడ్ చేసి ప్రయత్నించండి లేదా కొద్ది నిమిషాల్లో తిరిగి ప్రారంభించండి' అనే మెసేజ్ ప్రదర్శించింది. అయితే ఈ అంతరాయనికి కారణాల గురించి గూగుల్ ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు.

 

అంతకుముందు ఆగస్టులో కూడా  జిమెయిల్ లో లోపం ఎదురైనట్లు, చాలా మంది వినియోగదారులు ఇమెయిల్‌లు ఓపెన్ కావడం లేదని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. చాలా మంది ఇమెయిల్‌లను పంపించలేకపోయామని, ముఖ్యంగా ఫైళ్లు యాడ్ చేయడంలో సమస్యలు ఎదురుకొన్నామని చెప్పారు.

ఇతర వినియోగదారులు గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్స్ వంటి గూగుల్ జి-సూట్ సర్వీసెస్ సమస్యలను ఎదుర్కొంటున్నామని కూడా తెలిపారు.
 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios