వాచ్ తయారీ సంస్థ గార్మిన్ ఫోర్రన్నర్ 745 స్మార్ట్ వాచ్ ను యుఎస్ లో ప్రారంభించింది. ఈ వాచ్ కంపెనీ స్మార్ట్ వాచ్ పోర్ట్‌ఫోలియోలో సరికొత్తగా ప్రవేశించింది. ఈ ప్రీమియం స్మార్ట్‌వాచ్ కి 1.2-అంగుళాల కలర్ డిస్ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్, తేలికపాటి డిజైన్‌ను అందించారు.

గార్మిన్ ఫోర్రన్నర్ 745 వాచ్ నాలుగు రంగులలో, సిలికాన్ బెల్ట్ తో వస్తుంది. ఇంటర్నల్ జి‌పి‌ఎస్ , వి‌ఓ2 మాక్స్ సెన్సార్ ఉన్నయి. ఈ స్మార్ట్ వాచ్ అనేక రకాలైన కార్యకలాపాలను ట్రాక్ చేయగలదు.

గార్మిన్ 745 ధర
గార్మిన్ ఫోర్రన్నర్ 745 ధర యూ‌ఎస్ లో 499 (సుమారు రూ. 36,700) డాలర్లు. ప్రస్తుతం అధికారిక వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంది. బ్లాక్, మాగ్మా రెడ్, నియో ట్రాపిక్, వైట్‌స్టోన్ అనే నాలుగు రంగులలో అందిస్తున్నారు. ప్రస్తుతానికి అంతర్జాతీయ లభ్యతపై ఎలాంటి సమాచారం లేదు.

also read గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి పేటీఎం యాప్‌ ఔట్.. కారణం ? ...

గార్మిన్ 745 ఫీచర్స్
గార్మిన్ రూపొందించిన ఫోర్రన్నర్ 745 వాచ్ 1.2 అంగుళాల కలర్ టచ్ డిస్ప్లేతో 240x240 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. ట్రాన్స్‌ఫ్లెక్టివ్ మెమరీ-ఇన్-పిక్సెల్ (MIP) డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అందించారు. ఈ స్మార్ట్ వాచ్ 5 ఎటిఎం వాటర్ రిసిస్టంట్ తో ఉంటుంది.

ఇంటర్నల్ జి‌పి‌ఎస్, ఒకే ఫుల్ ఛార్జీతో 7 రోజుల వరకు ఉంటుంది. మ్యూజిక్ లేకుండా జిపిఎస్‌ను ఉపయోగిస్తున్నప్పుడు ఫోర్రన్నర్ 745 16 గంటల వరకు ఉంటుంది. జిపిఎస్, మ్యూజిక్‌తో వాచ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు బ్యాటరీ సమయం 6 గంటలకు తగ్గుతుంది.  

వాచ్ లోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, బారోమెట్రిక్ ఆల్టిమీటర్, గ్లోనాస్, గైరోస్కోప్, థర్మామీటర్ ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ 47 గ్రాముల బరువు ఉంటుంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్, ఏ‌ఎన్‌టి + వై-ఫై పొందుతారు.

స్మార్ట్ వాచ్‌లో హార్ట్ రేటు సెన్సార్, బ్లడ్ ప్రేజర్, స్ట్రెస్ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్ ఉన్నాయి. గార్మిన్ ఫోర్రన్నర్ 745 లో స్టెప్ కౌంటర్, డిస్టెన్స్ కాలిక్యులేటర్, క్యాలరీ కౌంటర్, జిమ్ కార్యాచరణ ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి.

కార్డియో వర్కౌట్స్, యోగా, పైలేట్స్ వర్కౌట్ ను పర్యవేక్షించగలదు. గార్మిన్ ఫోర్రన్నర్ 745 ఆండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ డివైజెస్ తో కనెక్ట్ చేసుకోవచ్చు.  స్వీమింగ్, సైక్లింగ్, రన్నింగ్ ట్రాకింగ్‌ కూడా  చేస్తుంది.