మీరు మీ ఇంటికి కొత్త ఆండ్రాయిడ్ టీవీని కొనాలని ఆలోచిస్తున్నారా, అయితే ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ 43 అంగుళాల ఎల్‌ఈడీ టీవీ మోడళ్లపై  అత్యధిక తగ్గింపుతో విక్రయిస్తున్నది. అలాగే ఈ టీవీ మోడళ్ల కొన్ని ఫీచర్స్, వివరాలు గురించి మీకోసం..

ఫ్లిప్‌కార్ట్‌లో ఆండ్రాయిడ్ టీవీలపై ఏకంగా రూ.15 వేల వరకు డిస్కౌంట్ అందిస్తుంది. రియల్‌మీ, నోకియా, కోడాక్ బ్రాండ్ల వంటి 43 అంగుళాల ఆండ్రాయిడ్ ఎల్‌ఈడీ  టీవీ మోడల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ డిస్కౌంట్ తో కొనుగోలు చేయావచ్చు.

43 అంగుళాల నోకియా స్మార్ట్ టీవీ (43TAFHDN)

మీరు 43 అంగుళాల ఆండ్రాయిడ్ టివిని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే నోకియా బ్రాండ్ నుండి నోకియా (43TAFHDN)ఎల్‌ఇడి స్మార్ట్ టీవీ మోడల్ పై 37 శాతం తగ్గింపుతో రూ.24,999 (ఎంఆర్‌పి రూ. 39,999) కు కొనుగోలు చేయవచ్చు. అంటే కస్టమర్లు ఈ టీవీ మోడల్‌ను ఎంఆర్‌పి ధర కంటే రూ.15 వేలు చౌకగా కొనుగోలు చేయవచ్చు.

నోకియా ఆండ్రాయిడ్ టివితో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్  హాట్‌స్టార్, యూట్యూబ్  వంటి ఓ‌టి‌టి యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, గూగుల్ అసిస్టెంట్, ఇంటర్నల్ క్రోమ్ క్యాస్ట్  వంటి ఫీచర్స్ లభిస్తాయి. ఈ టీవీ రిఫ్రెష్ రేటు 60 Hz , సౌండ్ అవుట్ పుట్ 39 W.

also read ఎల్‌పి‌జి గ్యాస్ సిలిండర్ పై ప్రత్యేకమైన ఆఫర్.. ఈ యాప్‌తో రూ.500 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.. ...

43 అంగుళాల కోడాక్ స్మార్ట్ టీవీ (43CA2022)

25 వేల రూపాయల కన్నా తక్కువ బడ్జెట్ లో వినియోగదారులు ఈ కోడాక్ ఆండ్రాయిడ్ టీవీ ఎంచుకోవచ్చు. ఈ టీవీ పై 34 శాతం డిస్కౌంట్‌తో రూ .24,999 (ఎంఆర్‌పి ధర రూ.37,999)కు లభిస్తుంది. ఈ కోడాక్ ఎల్‌ఈడీ టీవీ ఎంఆర్‌పి ధర కంటే 13,000 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఈ టీవీతో నెట్‌ఫ్లిక్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి ఓ‌టి‌టి యాప్స్ కు కూడా సపోర్ట్ చేస్తాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ టీవీకి  వినియోగదారులు గూగుల్ అసిస్టెంట్, ఇంటర్నల్ క్రోమ్ క్యాస్ట్ వంటి ఫీచర్స్ పొందుతారు.

డిస్ ప్లే గురించి చెప్పాలంటే ఈ టీవీ అల్ట్రా హెచ్‌డి (4కే)తో వస్తుంది, దీని రిజల్యూషన్ 3840X2160 పిక్సెల్స్. 30 W సౌండ్ అవుట్‌పుట్, 60 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.

43 అంగుళాల రియల్‌మీ స్మార్ట్ టీవీ

ఈ రియల్‌మీ ఆండ్రాయిడ్ టీవీ మోడల్‌ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం 7 శాతం తగ్గింపుతో లభిస్తుంది. డిస్కౌంట్ తరువాత ఈ టీవీని రూ.23,999 (ఎం‌ఆర్‌పి ధర రూ .25,999)కొనొచ్చు. ఈ టీవీ మోడల్‌ను ఎంఆర్‌పి కంటే రూ.2,000 కు చౌకగా లభిస్తుంది.  24 వాట్ల సౌండ్ అవుట్‌పుట్, 60 Hz రిఫ్రెష్ రేట్, ఫుల్-హెచ్‌డి 1920 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది.