న్యూ ఢీల్లీ:  ఈ-కామర్స్ దిగ్గజం  ఫ్లిప్‌కార్ట్  సరికొత్త సర్వీస్ ప్రవేశపెట్టింది. కేవలం తక్కువ సమయంలోనే ఆర్డర్ డెలివరీ చేయనుంది. లోకల్  ఫ్లిప్‌కార్ట్ హబ్‌ల నుంచి ఉత్పత్తులను కేవలం 90 నిమిషాల్లో అందజేస్తామని హామీ ఇచ్చిన హైపర్‌లోకల్ సర్వీస్ ‘ఫ్లిప్‌కార్ట్ క్విక్’ ను ప్రారంభిస్తున్నట్లు మేజర్ ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.

దాని సాంకేతిక సామర్థ్యాలు, సప్లై చైన్ సదుపాయాల ఆధారంగా ఫ్లిప్‌కార్ట్  హైపర్‌లోకల్ డెలివరీ వినియోగదారులకు కిరాణా, పాలు, మాంసం ఉత్పత్తులు, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు, స్టేషనరీ వస్తువులు, గృహోపకరణాల నుండి విభిన్నమైన విభాగాలలో 2 వేలకు పైగా ఉత్పత్తులను అందుబాటులో ఉన్నాయి.  

వినియోగదారుల సౌలభ్యం ప్రకారం 90 నిమిషాల్లో ఆర్డర్ లేదా 2-గంటల స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు వినియోగదారులు రోజులో ఎప్పుడైనా ఆర్డర్లు ఇవ్వవచ్చు, వారి ఆర్డర్‌లను ఉదయం 6 నుండి అర్ధరాత్రిలోగా డెలివరీ అందిస్తుంది. అయితే, వినియోగదారులు కనీసం రూ.29 డెలివరీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

also read ఉద్యోగులకు గుడ్ న్యూస్ : జూన్ 2021 వరకు వర్క్ ఫ్రోం హోం పొడిగింపు.. ...

ఇది భారతదేశానికి ఒక గొప్ప మోడల్, స్థానిక కిరాణా దుకాణాలకు ప్రోత్సాహంతోపాటు, కొత్త వ్యాపార వ్యూహాలు, ఒప్పందాలకు అవకాశం కల్పిస్తుందని ఫ్లిప్‌కార్ట్ ఉపాధ్యక్షుడు సందీప్ కార్వా అన్నారు. ఫ్లిప్‌కార్ట్ క్విక్ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్, పనాథూర్, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్, బిటిఎం లేఅవుట్, బనశంకరి, కెఆర్ పురం, ఇందిరానగర్ వంటి నగరాల్లో  ఈ సర్వీస్ ప్రవేశపెట్టింది.

రాబోయే కొద్ది నెలల్లో ఈ సేవ ఇతర నగరాలకు విస్తరించనున్నారు. డెలివరీ ప్రదేశాన్ని గుర్తించడానికి పిన్-కోడ్ వ్యవస్థను ఉపయోగించే సాంప్రదాయ నమూనా కాకుండా , ఫ్లిప్‌కార్ట్ క్విక్ లొకేషన్ మ్యాపింగ్ కోసం వినూత్న, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది.