శాన్ఫ్రాన్సిస్కో, యునైటెడ్ స్టేట్స్: కరోనావైరస్ మహమ్మారికి వ్యాప్తి కొనసాగుతున్నందున ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్  వర్క్ ఫ్రోం హోమ్ జూలై 2021 వరకు పొడిగిస్తున్నట్లు సోమవారం  తెలిపింది.

గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో "ఉద్యోగులకు ముందస్తు ప్రణాళికలు ఇవ్వడానికి, ఆఫీసులో ప‌ని అవ‌స‌రం లేని వారికి వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను జూన్ 30, 2021 వరకు పొడిగిస్తున్న‌ట్లు తెలిపారు".

also read స్మార్ట్‌ఫోన్‌ యూసర్ల కోసం వొడాఫోన్ కొత్త ఈసిమ్‌.. ...

ఈ వార్తలను మొదట ఒక ఇంగ్లిష్ పత్రిక నివేదించింది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2లక్షల మంది గూగుల్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల వ్యవధి జనవరిలో పూర్తి కావడానికి ఉంది అయితే వారికి పొడిగింపు ఆప్షన్ ఉంటుందని చెప్పారు.

రాబోయే నెలల్లో క్రమంగా తమ కార్యాలయాలను తిరిగి తెరవాలని పలు టెక్ సంస్థలు పేర్కొన్నాయి.