ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా డిస్కౌంట్లను అందిస్తున్నారు.   రెడ్‌మి 8ఎ, మోటరోలా వన్ యాక్షన్, రియల్‌ మీ 3, మోటరోలా వన్ విజన్, ఐఫోన్ 7, లెనోవా ఎ6 స్మార్ట్ ఫోన్స్ ఈ సేల్స్ లో ఉన్నాయి. జనవరి 19 నుండి ప్రారంభమై జనవరి 22 వరకు అంటే  నాలుగు రోజుల పాటు ఈ సేల్స్ ఉంటాయి. ఐఫోన్ ఎక్స్‌ఎస్‌ ఎస్‌ఎం స్మార్ట్ ఫోన్ పై కూడా డిస్కౌంట్ అందిస్తుంది.

జనవరి 19 నుండి  22 మధ్య యు.ఎస్ దిగ్గజం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌ ప్రవేశపెట్టినందుకు ఫ్లిప్‌కార్ట్ కూడా ఈ రిపబ్లిక్ డే సేల్ 2020 ఆఫర్ ద్వారా అమెజాన్‌ను ఎదుర్కోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్లిప్‌కార్ట్  “బ్లాక్ బస్టర్ డీల్స్”, “రష్ అవర్స్ ”, ఇంకా “ ప్రైస్ క్రాష్ ” సేల్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తుంది.

also read రెడ్‌ మి స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా అయితే మీకో గుడ్ న్యూస్...

మొబైల్ ఫోన్‌లలో ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లపై స్నీక్ పీక్  మైక్రోసైట్ ప్రకారం రెడ్‌మి 8ఎ ప్రారంభ ధర రూ. 5,999. మోటరోలా వన్ యాక్షన్‌ను స్మార్ట్ ఫోన్ రూ. 8.999 వద్ద ఆఫర్ చేస్తుంది అయితే ఈ  హ్యాండ్‌సెట్ సాధారణంగా రూ. 10.999లకు మార్కెట్లో లభ్యమవుతుంది.


ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులు ఐఫోన్ 7 32 జిబి స్టోరేజ్ మోడల్‌ను రూ. 24,999కే అందిస్తుంది. దీని అసలు ధర రూ. 27.999. ఫ్లిప్‌కార్ట్ సేల్స్ సమయంలో రియల్‌ మీ 3 రూ. 6.999కే కొనుగోలు చెయ్యొచ్చు. దీని మార్కెట్ ధర 7,999.


ఫ్లిప్‌కార్ట్ సేల్స్ మోటరోలా వన్ విజన్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 13,999. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో ఉన్న లెనోవా ఎ 6 నోట్‌ ధర రూ. 5,499, దీని ప్రస్తుత ధర రూ. 7999. ఇంకా 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌ గల మోటో ఇ6 ఎస్ రూ. 6,499 అందుబాటులో ఉంది. వినియోగదారులకు లెనోవా కె10 నోట్ రూ. 8,999 కే కొనుగోలు చెయ్యొచ్చు అయితే దీని మార్కెట్ ధర మాత్రం రూ.11,999.


ఫ్లిప్‌కార్ట్ ఆసుస్ 5 జెడ్‌ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ ధర రూ. 18.999. ఈ ఫోన్ ప్రస్తుత మార్కెట్ ధర రూ. 21.999. అదేవిధంగా ఈ అమ్మకాలలో ఆసుస్ మాక్స్ ఎం2 ప్రారంభ ధర రూ. 6,999, మార్కెట్ ధర వచ్చేసి రూ. 7.499. హానర్ 10 లైట్  స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్స్ సమయంలో డిస్కౌంట్ అందిస్తుంది అయితే  ప్రారంభ ధర రూ. 7,999. మార్కెట్ ధర రూ. 8.499.


ఎలక్ట్రానిక్స్, ఆసేసొరిస్ పై ఫ్లిప్‌కార్ట్ సెల్ అఫర్లు


 ఎలక్ట్రానిక్స్ ఇంకా ఆసేసొరిస్ పై 80 శాతం తగ్గింపు, స్మార్ట్‌వాచ్‌లపై 50 శాతం వరకు తగ్గింపు, హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లపై 70 శాతం వరకు తగ్గింపు, టీవీలు, టీవీలు ఆసేసొరిస్ పై 75 శాతం వరకు తగ్గింపును ఇస్తుంది.ఏసర్ స్విఫ్ట్ 3 ల్యాప్‌టాప్, ఆపిల్ వాచ్ సిరీస్ 3, ఆపిల్ ఎయిర్‌పాడ్‌లు సేల్స్ సమయంలో ఆకర్షణీయమైన ధరలను పొందే అవకాశం ఉంది. ఏసెర్, హెచ్‌పి, డెల్, లెనోవా వంటి సంస్థల నుండి ల్యాప్‌టాప్‌లు అలాగే డెస్క్‌టాప్‌లపై 45 శాతం వరకు తగ్గింపు ఉంటుంది.

also read అమ్మకందార్లతో కుమ్మక్కు... అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​​ డిస్కౌంట్ ఆఫర్లపై సీసీఐ ఇన్వెస్టిగేషన్...


డీఎస్‌ఎల్‌ఆర్‌లు, డిజిటల్ కెమెరాలపై డిస్కౌంట్ కోరుకునే వినియోగదారులు కూడా వివిధ మోడళ్లపై కొంత  డిస్కౌంట్‌ ఉంటుందని తెలిపింది. అదేవిధంగా ఆపిల్ ఐప్యాడ్ మినీ, ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్, ఆపిల్ ఐప్యాడ్ ప్రో, హువావే ఎం5 లైట్, హానర్ మీడియాప్యాడ్ టి3 వంటి టాబ్లెట్‌ పై ఆకర్షించే ఆఫర్‌లను పొందవచ్చు. గేమర్‌లకు వివిధ పిసి, కన్సోల్ గేమ్స్, గేమింగ్ హెడ్‌సెట్‌లు , గేమింగ్ మైస్ పై డిస్కౌంట్ పొందే అవకాశం లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ సేల్ లో బ్యాంక్ ద్వారా ఆఫర్లు


ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులు లేదా కోటక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించే వారు ఫ్లిప్‌కార్ట్ 10 శాతం ఇన్స్టంట్ తగ్గింపును అందిస్తుంది. జనవరి 15 నుండి 17 మధ్య సెలెక్టెడ్ ఉత్పత్తులపై ప్రీ-బుకింగ్‌లు ఉంటాయి. ప్రీ-బుకింగ్‌లు కింద ప్రాడక్ట్  ఫ్లిప్‌కార్ట్ సేల్ ధరలు కంటే తక్కువకే లభిస్తాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు జనవరి 18 నుండి రాత్రి 8 గంటల నుండి రిపబ్లిక్ డే సేల్‌ను యాక్సెస్ చేయగలరు.