రెడ్ మి స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా అయితే మీకో గుడ్ న్యూస్...
అటు టెలికాం నెట్వర్కులు రిచార్జ్ ప్లాన్ల టరిఫ్లను మారుస్తుండటంతో ఏ రిచార్జ్ ఎంచుకోవాలో వినియోగదారులు అయోమయంలో పడిపోతున్నారు. ఇందుకోసం టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త వైఫై కాలింగ్ సర్విస్ ని ప్రవేశపెట్టింది.
ముంబై: ఈ మధ్య కాలంలో ఒక కొత్త ఫీచర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అటు టెలికాం నెట్వర్కులు రిచార్జ్ ప్లాన్ల టరిఫ్లను మారుస్తుండటంతో ఏ రిచార్జ్ ఎంచుకోవాలో వినియోగదారులు అయోమయంలో పడిపోతున్నారు. ఇందుకోసం టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త వైఫై కాలింగ్ సర్విస్ ని ప్రవేశపెట్టింది.
also read అమ్మకందార్లతో కుమ్మక్కు... అమెజాన్, ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ ఆఫర్లపై సీసీఐ ఇన్వెస్టిగేషన్...
మొదటిగా దీనిని కొద్ది రోజులపాటు టెస్టింగ్ చేసి తరువాత ప్రస్తుతం వినియోగదారులకి అందుబాటులోకి తిసుకొచ్చారు.దీనిపై కొద్ది రోజులుగా ఒక అస్పష్టత మొదలైంది అది ఏంటంటే దీని ఎలా ఉపయోగించాలి అసలు ఆ స్మార్ట్ ఫోన్లకి సపోర్ట్ చేస్తుంది అని ఇందుకోసం స్మార్ట్ ఫోన్స్ కొంపెనీలు అన్నీ ఈ వైఫై కాలింగ్ ఫీచర్ కి సపోర్ట్ గా స్మార్ట్ ఫోన్లను అప్ డేట్స్ చేస్తున్నాయి.
ఇందులో భాగంగా కొత్తగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు చైనా దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమికి చెందిన రెడ్‌మి తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. వైఫై కాలింగ్ ఫీచర్ని రెడ్‌మి స్మార్ట్‌ఫోన్లలో కల్పిస్తున్నట్టు మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. టెలికాం దిగ్గజ కంపెనీలు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో తన విని యోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చిన వాయిస్ వైఫై కాలింగ్ సేవలను ఇక మీదట తమ స్మార్ట్‌ఫోన్లలో వినియోగించు కోవచ్చని ప్రకటించింది.
also read అమెజాన్ పై పోలీస్ కేసు నమోదు...ఎందుకంటే...
ఈమేరకు ఫోన్ల జాబితాని ట్విటర్‌లో ద్వారా షేర్ చేసింది.ఎయిర్‌టెల్ కూడా ఢిల్లీ ఎన్‌సిఆర్ ఇంకా దేశవ్యాప్తంగా వై ఫై కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ వైఫై సబ్ స్క్రైబర్లు 10 లక్షలు దాటారని కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. అటు రిలయన్స్ జియో కూడా ఈ సదుపాయాన్ని కొన్ని పరిమిత సర్కిళ్లలో లాంచ్ చేసింది.
త్వరలోనే దేశ వ్యాప్తంగా ఈ సర్విస్ ని అందుబాటులో తిసుకొస్తామని తెలిపింది. ఈ సేవలకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. వీఓ వైఫై టెక్నాలజీతో పబ్లిక్ హాట్‌స్పాట్ లేదా ప్రైవేట్ హోం వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసుకొని ఏ మొబైల్‌ఫోన్‌కైనా, ల్యాండ్‌లైన్‌కైనా ఆన్ లీమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.