భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) కొత్త రీఛార్జ్ ప్లాన్  ప్రవేశపెట్టింది. రూ.399 రిచార్జ్ తో 80 రోజుల వాలిడిటీ, కాలింగ్, డేటా ప్రయోజనాలను అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ వాయిస్ కాల్స్ కోసం 250 నిమిషాలు అవుట్ గోయింగ్ అందిస్తుంది. ఈ  కొత్త ప్లాన్ చెన్నై, తమిళనాడులో ప్రవేశపెట్టారు.

బిఎస్ఎన్ఎల్ రెండు సర్కిల్‌లలో రూ.1699 టారిఫ్ వోచర్‌ను నిలిపివేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన రూ.399 రీఛార్జ్ ప్లాన్ ఆగస్టు 15 నుంచి అందుబాటులో ఉంటుంది. రూ.399 రీఛార్జ్ ప్లాన్ తో రోజు 1జి‌బి హై-స్పీడ్ డేటా వస్తుంది.

1జి‌బి డాటా తర్వాత, 80కే‌బి‌పి‌ఎస్ వేగంతో ఆన్ లిమిటెడ్ డేటా అందిస్తుంది. దానితో పాటు నేషనల్ రోమింగ్ (ఢీల్లీ, ముంబైలోని ఎం‌టి‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ రోమింగ్ ప్రాంతంతో సహా) తో సహా ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్‌లను కూడా అందిస్తుంది.

also read అతిపెద్ద బ్యాటరీతో రియల్‌మీ కొత్త స్మార్ట్ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే ? ...


వాయిస్ కాల్స్ కోసం రోజుకు 250 అవుట్‌గోయింగ్ నిమిషాలు (లోకల్ + ఎస్‌టి‌డి + అవుట్ గోయింగ్ రోమింగ్) అని బి‌ఎస్‌ఎన్‌ఎల్ పేర్కొంది. 250నిమిషాల  అవుట్‌గోయింగ్ కాల్స్ తరువాత బేస్ ప్లాన్ టారిఫ్ రేట్లు చార్జ్ చేయనుంది.

“అడ్వాన్స్ పర్ మినట్ ప్లాన్ 94” దీని అర్థం వినియోగదారులకు మొబైల్ నెట్‌వర్క్ లేదా బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్‌లకు లోకల్ కాల్స్ కోసం నిమిషానికి రూ.1 చార్జ్ చేస్తుంది. ఇతర ల్యాండ్‌లైన్ నంబర్‌లకు, లోకల్  కాల్స్, ఎస్టీడీ కాల్‌లకు నిమిషానికి రూ.1.3 చార్జ్ చేయనుంది.

బీఎస్‌ఎన్‌ఎల్ రూ.399 ప్లాన్ రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లు, ఉచిత బి‌ఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్లు, ఉచిత లోక్‌ధన్ కంటెంట్‌ను కూడా అందిస్తుంది. వినియోగదారులు సి-టాపప్, సెల్ఫ్ కేర్, వెబ్ పోర్టల్ ద్వారా  ఈ ప్లాన్ ఆక్టివేట్ చేసుకోవచ్చు.

సెల్ఫ్ కేర్ పద్ధతి ద్వారా ప్లాన్ ఆక్టివేట్ చేయడానికి PLAN BSNL399 అని టైప్ చేసి 123 నంబరుకు ఎస్‌ఎం‌ఎస్ చేయండి. సెల్ఫ్ కేర్ పద్ధతి ద్వారా ప్లాన్ ఆక్టివేట్ చేసుకుంటే ఉచిత బి‌ఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్లు, ఉచిత లోక్‌ధన్ కంటెంట్‌ను అందించవని బి‌ఎస్‌ఎన్‌ఎల్ పేర్కొంది.