ఫేస్‌బుక్ కోత్త ఫీచర్: ఇన్‌స్టాగ్రామ్ యూసర్లతో డైరెక్ట్ చాట్ చేయవచ్చు..
మెసెంజర్ యాప్ వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు కొత్తగా యాప్‌ను డౌన్‌లోడ్ చేయకుండానే చాట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్ రెండూ స్వతంత్ర యాప్‌గా ఉన్నప్పటికీ, వినియోగదారుల ఇన్‌బాక్స్ చాట్ వేరుగా కొనసాగుతాయని సంస్థ తెలిపింది.

సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ దాని మెసెంజర్ యాప్ ద్వారా కొత్త ఫీచర్ విడుదల చేసింది. మెసెంజర్ యాప్ వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు కొత్తగా యాప్‌ను డౌన్‌లోడ్ చేయకుండానే చాట్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్ రెండూ స్వతంత్ర యాప్‌గా ఉన్నప్పటికీ, వినియోగదారుల ఇన్‌బాక్స్ చాట్ వేరుగా కొనసాగుతాయని సంస్థ తెలిపింది.
కొత్త ఫీచర్ గురించి తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి, మెసెంజర్ హెడ్ స్టాన్ చుడ్నోవ్స్కీ మాట్లాడుతూ "ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ అనుభవాన్ని కనెక్ట్ చేస్తూ కొన్ని కొత్త మెసెంజర్ ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్‌లోకి తీసుకువచ్చాము.
ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ఈ కోత్త ఫీచర్ కోసం యాప్ అప్‌డేట్ చేయాలా వద్దా అని కూడా నిర్ణయించుకోవచ్చు" అని వారు పేర్కొన్నారు.
also read వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసన.. జియో సిమ్ కార్డులకు నిప్పు.. ...
ఫేస్‌బుక్ మెసెంజర్ సర్వీస్ తో పాటు ఫోటో-సర్వీస్ యాప్ ఇన్‌స్టాగ్రామ్, మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా ఫేస్‌బుక్ యజమాన్యంలో ఉంది. ప్రతి నెలా మూడు బిలియన్లకు పైగా ప్రజలు మా యాప్స్ లో ఒకదానికి లాగిన్ అవుతారని, ప్రతి రోజు వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు 100 బిలియన్లకు పైగా మెస్జెస్ పంపుతారని ఫేస్‌బుక్ పేర్కొంది.
ఫేస్‌బుక్ నిర్వహించిన ఒక పరిశోధనలో యు.ఎస్ రాష్ట్రంలో మెసేజింగ్ యాప్ ఉపయోగించే ఐదుగురిలో నలుగురు ఈ యాప్స్ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం ఈ యాప్స్ పై గడుపుతారు.
అయినప్పటికీ, వినియోగదారులకు ఒక నిర్దిష్ట సంభాషణ థ్రెడ్‌ను ఎక్కడ కనుగొనాలో గుర్తుంచుకోవడం కష్టం. ఈ కొత్త అప్ డేట్ ఫీచర్ వినియోగదారులు వారి స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాట్ చేయడానికి ఏ యాప్ ఉపయోగించాలో ఆలోచించకుండా కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుందని ఫేస్‌బుక్ పేర్కొంది.
క్రొత్త అప్‌డేట్ గురించి తెలుపుతూ కలర్స్, కస్టమ్ ఎమోజి యక్షన్స్, యానిమేటెడ్ మెసేజ్ ఎఫెక్ట్స్ తో సహా వినియోగదారుల కోసం 10 కంటే ఎక్కువ కొత్త ఫీచర్లను జోడించారని పేర్కొంది.
ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌లలోని కొత్త ఫీచర్లు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే ప్రారంభ దశలో అందుబాటులో ఉందని, త్వరలో ఇతర దేశాలకు విస్తరించనున్నట్లు ఫేస్‌బుక్ పేర్కొంది. అయితే ఆ దేశాల పేర్లు ప్రస్తావించలేదు.