న్యూ ఢీల్లీ: రైతుల చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్‌లోని రైతులు నిరసన చేపట్టారు. వ్యవసాయ చట్టాలపై కార్పొరేట్‌లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో భాగంగా రిలయన్స్‌కు చెందిన జియో సిమ్ కార్డులను నిప్పంటించడంతో నిరసన తీవ్రమైంది. 

అమృత్సర్‌లో జరిగిన నిరసన సందర్భంగా రైతులు జియో సిమ్‌లకు నిప్పంటించారు. సోషల్ మీడియాలో జియో సిమ్‌కు వ్యతిరేకంగా చేసిన ప్రచారంలో కొంతమంది జియో సిమ్‌లను కూడా నాశనం చేశారు.  

రిలయన్స్ జియో మొబైల్ సిమ్ కార్డులకు వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్రచారంలో కొంతమంది పంజాబీ గాయకులు కూడా "అగ్రి-మార్కెటింగ్ చట్టానికి" నిరసనగా రిలయన్స్ జియో మొబైల్ సిమ్ కార్డులను ధ్వంసం చేస్తున్నట్లు గురువారం ఒక వార్తా పత్రిక నివేదించింది.

also read ఫెస్టివల్ సీజన్ లో స్మార్ట్‌ఫోన్ ధరలకు రెక్కలు..! ...

కొన్ని నివేదికల ప్రకారం అనేక మంది పంజాబీ గాయకులు ఈ నిరసనలో పాల్గొని, నిరసనకు నాయకత్వం వహించడానికి రైతులతో సంయుక్త సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. వారిలో కొందరు వాహనాల ఇధానం కోసం రిలయన్స్ పెట్రోల్ పంపుల వాడొద్దని కోరారు.

రిలయన్స్ పెట్రోల్ / డీజిల్ బంకులను వినిగించకూడదని డిమాండ్ చేస్తూ కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. వ్యవసాయ చట్టాల ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబానీ, అదాని వంటి సంస్థలను బలపరుస్తోందనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిరసన ప్రారంభించారు.

"రిలయన్స్ జియో నంబర్లను బహిష్కరించాలని మేము పిలుస్తున్నాము అలాగే రిలయన్స్ బంకులకు ప్రవేశం లేదు" అని ఆయన అన్నారు. కార్పోరేట్లను బహిష్కరించడాన్ని రైతులు అమలు చేయడం ప్రారంభించారు ”అని కిసాన్ యూనియన్ అధ్యక్షుడు మంజిత్ సింగ్ రాయ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నారు.

అంతకుముందు ఇండియాగేట్ సమీపంలో ఉన్న ఒక ట్రాక్టర్‌కు పంజాబ్ యూత్ కాంగ్రెస్ నిప్పంటించింది. పంజాబ్, హర్యానాలో రైతులు రైళ్లను అడ్డుకున్నారు. దేశవ్యాప్తంగా రైతులు నిరసనలు ముమ్మరం చేశారు.