Asianet News TeluguAsianet News Telugu

ఫేస్‌బుక్‌​ మరో భారీ డీల్‌..జిఫీ వెబ్‌సైట్‌ కొనుగోలు..

జిఫీ ఇంటర్నెట్‌లోని అతిపెద్ద జిఫీ సైట్‌లలో ఒకటి, జిఫీలను సృష్టించడం, భాగస్వామ్యం చేయడం వంటివి అందిస్తుంది. ఫేస్‌బుక్ ఇప్పటికే తన యాప్ లో జిఫీలను సోర్సింగ్ కోసం జిఫీ ఏ‌పి‌ఐ పై ఆధారపడింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, వాట్సాప్ అన్నీ ఇప్పటికే జిఫీతో పనిచేస్తున్నాయి. 

facebook anothe big deal: buys popular gifhy website
Author
Hyderabad, First Published May 16, 2020, 2:40 PM IST

ప్రముఖ సోషల్ మీడియా  దిగ్గజం ఫేస్‌బుక్‌​ పాపులర్‌ జిఫీ వెబ్‌సైట్‌ ని కొనుగోలు చేయనుంది. భారీ జీఫీ లైబ్రరీని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇతర  యాప్ లలో  చేర్చడానికి ఫేస్‌బుక్ ప్రముఖ జిఫీ మేకింగ్, షేరింగ్ వెబ్‌సైట్ జిఫీని 400 మిలియన్ల ధరకు కొనుగోలు చేయనుంది.ఈ ఒప్పందం సంబంధించి వార్తలను మొదట ఒక ఇంగ్లిష్ వెబ్ సైట్ నివేదించింది, ఇది ఒప్పందం 400 మిలియన్ల విలువ ఉన్నట్లు తెలిపింది.

జిఫీ ఇంటర్నెట్‌లోని అతిపెద్ద జిఫీ సైట్‌లలో ఒకటి, జిఫీలను సృష్టించడం, భాగస్వామ్యం చేయడం వంటివి అందిస్తుంది. ఫేస్‌బుక్ ఇప్పటికే తన యాప్ లో జిఫీలను సోర్సింగ్ కోసం జిఫీ ఏ‌పి‌ఐ పై ఆధారపడింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, వాట్సాప్ అన్నీ ఇప్పటికే జిఫీతో పనిచేస్తున్నాయి.

ఫేస్‌బుక్ ప్రకారం, జిఫీ మొత్తం ట్రాఫిక్ లో 50 శాతం దాని యాప్ ల నుండి వస్తుంది. అందులో సగం ఇన్‌స్టాగ్రామ్ నుండి మాత్రమే వస్తుంది.

also read వృద్ధులు, దివ్యాంగులకూ గుడ్ న్యూస్: బ్యాంక్​ నుంచి క్యాష్ 'హోం డెలివరీ'

దాని కొత్త యాజమాన్యంలో, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు, లైవ్ సందేశాలలో జిఫీలు, స్టిక్కర్‌లను పంపించడానికి మరింత సులభం చేయాలనే లక్ష్యంతో, గిఫీ ఇన్‌స్టాగ్రామ్ బృందంలో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతానికి, ఫేస్‌బుక్ జిఫీ వినియోగదారులకు కూడా అదే విధంగా ఉంటుందని చెప్పారు.

“ప్రజలు ఇప్పటికీ జిఫీలను అప్‌లోడ్ చేయగలరు, డెవలపర్లు, ఏ‌పి‌ఐ భాగస్వాములు జిఫీ  ఏ‌పి‌ఐలకు ఒకే ప్రాప్యతను కలిగి ఉంటారు. జిఫీ క్రియేటివ్ కమిటీ ఇంకా గొప్ప కంటెంట్‌ను సృష్టించగలుగుతుంది ”అని ఇన్‌స్టాగ్రామ్ ప్రాడక్ట్  వి‌పి విశాల్ షా ఒక బ్లాగ్ పోస్ట్‌లో ఆ సమాచారాన్ని ప్రకటించారు.

ట్విటర్, స్నాప్‌చాట్, బైట్ డాన్స్ టిక్‌టాక్ వంటి సామాజిక వేదికలతో గిఫీ ప్రస్తుత అనుసంధానాలు మారవు అని ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎప్పటిలాగానే  వైడర్‌ ఎకోసిస్టంలో జిపీ అందుబాటులో వుంటుందని జిఫి కూడా ప్రకటించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios