ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ భారతదేశ కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. జెఫ్ బెజోస్ నేతృత్వంలోని ఈ-కామర్స్ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ పండుగ సీజన్ లో  భారతదేశంలో ఆన్ లైన్ షాపింగ్ రెట్టింపు చేసేందుకు అమెజాన్ పోర్టల్‌ ఇక నుంచి  దక్షిణ ప్రాంతాల భాషలు కన్నడ, మలయాళం, తమిళం, తెలుగులో అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీని వల్ల అదనంగా 20-30 కోట్ల వినియోగదారులను  చేరుకోవడానికి ఇది దోహదం చేస్తుందని వివరించింది. అంతేకాకుండా దేశంలో పండుగ సీజన్ ప్రారంభం కానున్నందున, ఇలాంటి చర్యకు ఇది సరైన సమయం. అందువల్ల, అమెజాన్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందాలని కోరుకుంటుంది. 

also read మీరు మీ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ చేసే ముందు వీటిని గుర్తించుకోండి.. ...

సంస్థ 2 సంవత్సరాల క్రితం హిందీ పోర్టల్‌  అందుబాటులోకి తెచ్చింది, దీనిని వెబ్‌సైట్, యాప్ కోసం రూపొందించారు. అమెజాన్ ప్రకారం  ఈ చర్య  దేశంలో ఎక్కువ మంది వినియోగదారులను చేరుకోవడానికి సహాయపడింది, గత ఐదు నెలల్లో హిందీ బాషలో పోర్టల్ వాడకం మూడు రెట్లు పెరిగిందని కంపెనీ పేర్కొంది.

కస్టమర్లు తమకు అనువైన భాషలో డీల్స్, డిస్కౌంట్లను తెలుసుకోవడం, ఉత్పత్తుల సమాచారం చదువుకోవడం, ఖాతాల నిర్వహణ, ఆర్డర్లు, చెల్లింపులు జరప‌డం సుల‌భం అవుతుంద‌ని అమెజాన్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ కిశోర్‌ తెలిపారు.

ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ యాప్స్, మొబైల్, డెస్క్‌టాప్‌ సైట్స్‌లో వినియోగదార్లు తమకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. అలాగే కస్టమర్‌ కేర్ సిబ్బందితో తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళంలో కూడా మాట్లాడవచ్చు.