Asianet News TeluguAsianet News Telugu

లాక్‌డౌన్‌ కారణంగా వాటికి భలే గిరాకీ..తక్కువ ధరకే అందించేదుకు కంపెనీలు సిద్దం...

 చైనాలో పుట్టి ప్రపంచదేశాలకు వ్యప్తించి అన్నీ రంగాలపై, వ్యాపారాలపై, దేశ ఆర్ధిక రంగంపై కరోనా కాటు వేసింది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ దీని బారిన పడి మృతి చెందుతున్నారు. దీంతో  అన్ని దేశాలు లాక్‌డౌన్‌లు విధించాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుందని నిపుణుల సూచిస్తున్నరు.

demand hike  for laptops smart phones in corona virus lock down
Author
Hyderabad, First Published Jun 20, 2020, 7:47 PM IST

న్యూఢిల్లీ: ప్రపంచదేశాలను వనికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అగ్రదేశాలను కూడా వోదల లేదు. చైనాలో పుట్టి ప్రపంచదేశాలకు వ్యప్తించి అన్నీ రంగాలపై, వ్యాపారాలపై, దేశ ఆర్ధిక రంగంపై కరోనా కాటు వేసింది.

చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ దీని బారిన పడి మృతి చెందుతున్నారు. దీంతో  అన్ని దేశాలు లాక్‌డౌన్‌లు విధించాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుందని నిపుణుల సూచిస్తున్నరు. లాక్ డౌన్ కారణంగా స్కూల్స్, కాలేజీలు మూతపడ్డాయి.

కరోనా వైరస్ కి మందు లేనందున ప్రతుత్తం సామాజిక దూరమే పరిష్కారమని వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. భరతదేశంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత తరుణంలో పిల్లలకు, విద్యార్ధులకు స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ల ద్వారా ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు.

విద్యకు సంబంధించిన అంశాలను ఇంటర్నెట్ సహాయంతో  పిల్లలకు నేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎలక్ట్రానిక్స్ వస్తువులకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం రూ.10,000 నుంచి 15,000 విలువ చేసే ట్యాబ్లెట్‌ ఫోన్లకు అధిక గిరాకీ ఉందని ఎలక్ట్రానిక్స్ దిగ్గజం లెనివో ఇండియా డైరెక్టర్‌ పంకజ్‌ హర్‌జై తెలిపారు.

also read వ‌ర్షంలో మీ స్మార్ట్ ఫోన్ తడిసిందా..? అయితే వెంట‌నే ఇలా చేయండి!

కాగా ట్యాబ్లెట్‌ ఫోన్లకు కూడా అధిక డిమాండ్‌ ఏర్పడడంతో పిల్లలను, విద్యార్ధులను అలరించే సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటామని హర్‌జై స్పష్టం చేశారు. జూమ్, ఇతర యాప్ ల  ద్వారా ఆన్ లైన్ క్లాసెస్ కోసం ట్యాబ్లెట్‌ ఫోన్లకు అధిక డిమాండ్‌ ఉందని టెలికం సంస్థకు చెందిన వ్యాపారి మనీష్‌ ఖత్రి పేర్కొన్నారు.

ఎలాంటి సమయంలో మార్కెట్‌లో నెల​కొన్న పోటీ నేపథ్యంలో ల్యాప్‌టాప్‌ తయారీ సంస్థలు తక్కువ ఖర్చుతో అత్యధిక క్వాలిటీ గల ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నాయి. ప్రస్తుతం ల్యాప్‌టాప్‌ తయారీ సంస్థలు రూ.20,000నుంచి రూ.30,000 ధరకు ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రముఖ రీసెర్చ్‌ డైరెక్టర్‌ నవకేందర్‌ సింగ్‌ పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌కు ముందు తల్లిదండ్రులు విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు కొనివ్వడానికి మొగ్గు చూపేవారు కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆన్ లైన్ క్లాసెస్ ద్వారా ఇంటర్నెట్ వినియోగం కూడా భారీగా పేరిగింది. దీంతో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు డిమాండ్ పెరిగింది. ఒక పక్క సేల్స్ పెంచుకునేందుకు ఎలెక్త్రోనిక్ కంపెనీలు కూడా నాణ్యమైన వీటిని తక్కువ ధరకే అందించాలని చూస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios