చింగారీ యాప్‌లో కొత్త మార్పులు..ట్విట్టర్ ద్వారా ప్రకటన..
టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న భారతీయ యాప్ చింగారి ఇప్పుడు ఈ నెలాఖరులోగా 100 మిలియన్ల వినియోగదారులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చింగారి యాప్ సహ వ్యవస్థాపకుడు సుమిత్ ఘోష్ మాట్లాడుతూ పెరుగుతున్న యూసర్లు, డౌన్‌లోడ్స్ అనుగుణంగా కంపెనీ తీవ్రంగా కృషి చేస్తోంది.
చింగారి యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో 10 మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటింది. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న భారతీయ యాప్ చింగారి ఇప్పుడు ఈ నెలాఖరులోగా 100 మిలియన్ల వినియోగదారులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
చింగారి యాప్ సహ వ్యవస్థాపకుడు సుమిత్ ఘోష్ మాట్లాడుతూ పెరుగుతున్న యూసర్లు, డౌన్‌లోడ్స్ అనుగుణంగా కంపెనీ తీవ్రంగా కృషి చేస్తోంది. చింగారి యాప్ త్వరలో యూఎక్స్, బగ్స్ నుంచి అన్ని రకాలుగా యాప్‌ను మార్పుచేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
చింగారి యాప్ ఇప్పుడు వీడియోలు, వార్తలపై మాత్రమే దృష్టి సారించింది. ఈ వార్తలు ఇప్పుడు చిన్న బులెటిన్(1 నిమిషం) ఫీడ్‌లు మాత్రమే అవుతాయని ఘోష్ చెప్పారు. 59 చైనా యాప్స్ ని భారతదేశ ప్రభుత్వం నిషేధించిన తరువాత భారీ డౌన్‌లోయడ్స్ పెరిగిన భారతీయ యాప్ లో చింగారి ఒకటి.
also read 'టిక్‌టాక్’లాగే అందరినీ ఆకర్షిస్తున్న షేర్‌షాట్ కొత్త యాప్... ...
గూగుల్ ప్లే స్టోర్‌లో చింగారి యాప్ 10 మిలియన్ల డౌన్‌లోడ్‌లను దాటింది. చింగారి యాప్ లో సుమారు 148 మిలియన్ వీడియోలు చూశారని, 3.5 మిలియన్ వీడియోలను లైక్స్ చేసారని గత వారం వెల్లడించారు. ఈ యాప్ 11 మిలియన్ల యూసర్లను సంపాదించింది.
ఈ నెలాఖరులోగా 100 మిలియన్ల యూసర్లకు చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. చింగారి యాప్ ఒక గంటలో లక్ష డౌన్‌లోడ్‌లను రికార్డ్ చేసిందని ఘోష్ ఇంతకు ముందు వెల్లడించారు. చింగారి యాప్ కేవలం 72 గంటల్లో 5లక్షల డౌన్‌లోడ్లను చూసింది.
మరో భారతీయ సోషల్ మీడియా యాప్ రోపోసో టిక్‌టాక్ యాప్ నిషేధం జరిగిన రెండు రోజుల్లోనే 22 మిలియన్ల డౌన్‌లోడ్‌లను నమోదు చేసింది. ఆక్టివ్ యూసర్లు ప్రతిరోజూ 62 నిమిషాలకు పైగా ఈ యాప్ చూస్తున్నారు. జనాదరణ పొందిన సోషల్ మీడియా యాప్ షేర్‌చాట్ ఇటీవల టిక్‌టాక్ ప్రత్యామ్నాయంగా ‘మోజ్’ యాప్ ను విడుదల చేసింది.