టిక్‌టాక్ స్థానంలో ఇండియన్ యాప్.. గంటకు 2 మిలియన్లకు పైగా వ్యూవర్స్..
2019లో బెంగళూరుకు చెందిన ఇద్దరు ప్రోగ్రామర్లు బిస్వాత్మా నాయక్, సిద్ధార్థ్ గౌతమ్ చింగారి యాప్ ని క్రియేట్ చేశారు. చైనీస్ యాప్ టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా కనిపించే ఇండియన్ యాప్ చింగారి దాదాపు 1 లక్ష డౌన్‌లోడ్‌లు దాటిందని, గంటకు 2 మిలియన్లకు పైగా వ్యూవర్స్ ఉన్నారని ఒక వార్తా సంస్థ తెలిపింది.
న్యూ ఢీల్లీ: టిక్‌టాక్, యుసి బ్రౌజర్, కామ్ స్కానర్‌తో సహా 59 చైనా మొబైల్ యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన తర్వాత, భారతీయ సోషల్ యాప్ చింగారి యాప్ డౌన్‌లోడ్లు ఒక్కసారి పెరిగాయి. చైనీస్ యాప్ టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా కనిపించే ఇండియన్ యాప్ చింగారి దాదాపు 1 లక్ష డౌన్‌లోడ్‌లు దాటిందని, గంటకు 2 మిలియన్లకు పైగా వ్యూవర్స్ ఉన్నారని ఒక వార్తా సంస్థ తెలిపింది.
భారతీయ సోషల్ యాప్ చింగారి గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు
2019లో బెంగళూరుకు చెందిన ఇద్దరు ప్రోగ్రామర్లు బిస్వాత్మా నాయక్, సిద్ధార్థ్ గౌతమ్ ఈ యాప్ సృష్టించారు. వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి, అప్‌లోడ్ చేయడానికి, స్నేహితులతో చాట్ చేయడానికి, కొత్త వ్యక్తులతో మాట్లాడటానికి, వీడియో కంటెంట్‌ను షేర్ చేయడానికి, ఫీడ్ ద్వారా బ్రౌజ్ చేయడానికి చింగారి యాప్ లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి.
చింగరి యాప్ వాడాలంటే ఆండ్రయిడ్ వెర్షన్ 5.0 లేదా అంతకంటే పై వర్షన్ ఓఎస్ ఉండాలి. చింగారి యాప్ వినియోగదారుకు వాట్సాప్ స్టేటస్, వీడియోలు, ఆడియో క్లిప్‌లు, జిఐఎఫ్ స్టిక్కర్లు, ఫోటోలతో క్రీయేటివిటీ పొందే అవకాశం లభిస్తుంది. ఈ యాప్ ఇంగ్లీష్, హిందీ, బంగ్లా, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం, తెలుగు భాషలలో లభిస్తుంది.
also read చైనా యాప్స్ నిషేధంపై మీరు తెలుసుకోవాల్సిన విషయాలు...
ఎవరైతే వీడియో క్రీయెట్ చేసి పోస్ట్ చేస్తారో వారు చేసే వీడియోలు ఎంత వైరల్ అవుతుందో దాని ఆధారంగా చింగారి యాప్ తన వినియోగదారులకు డబ్బులు కూడా చెల్లిస్తుంది. యాప్ లో యూసర్ అప్‌లోడ్ చేసే ప్రతి వీడియోకి ఒక్కో వ్యూకి పాయింట్లు లభిస్తాయి, ఈ పాయింట్లను డబ్బు రూపంలో రీడీమ్ చేసుకోవచ్చు.
చింగారి యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసి) వద్ద పెరుగుతున్న ఉద్రిక్తత మధ్య చైనాపై పెద్ద ప్రతీకారంగా టిక్ టాక్, యుసి బ్రౌజర్, కామ్ స్కానర్‌తో సహా 59 చైనా మొబైల్ యాప్‌లను భారత ప్రభుత్వం సోమవారం (జూన్ 29) నిషేధించింది.
భారతదేశ రక్షణ, రాష్ట్ర భద్రత, ప్రజాల భద్రత వంటి వాటికి ఈ యాప్స్ భంగం కలిగించేలా ఉన్నాయని భారత ప్రభుత్వం నుండి వెలువడిన ఒక ప్రకటనలో తెలిపింది.