Asianet News TeluguAsianet News Telugu

బి‌ఎస్‌ఎన్‌ఎల్ ఇంటర్నెట్ వాడుతున్నారా...అయితే మీకో గుడ్ న్యూస్..

ఉచిత ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడానికి బిఎస్ఎన్ఎల్ టెలికాం మే 19 వరకు ‘వర్క్ @ హోమ్’ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ వాలిడిటీని  పెంచింది.మార్చిలో బిఎస్‌ఎన్‌ఎల్ టెలికాం బ్రాడ్‌బ్యాండ్  ల్యాండ్‌లైన్ కస్టమర్ల కోసం వర్క్ @ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రకటించింది.

bsnl telecom extends "work home" broadband plan untill may 19
Author
Hyderabad, First Published Apr 27, 2020, 5:27 PM IST

భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) “వర్క్ @ హోమ్” ప్రమోషనల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వాలిడిటీని మే 19 వరకు పొడిగించింది. బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ వినియోగదారులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికి గత నెలలో ఈ ప్లాన్ ప్రారంభించారు.

సామాజిక దూరాన్ని ప్రోత్సహించడానికి, ఇంటి నుండి పని చేయడానికి వినియోగదారులని ప్రోత్సహించడానికి  బిఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ సబ్ స్క్రైబర్ రోజూ 5 జిబి డేటాతో 10 ఎమ్‌బిపిఎస్ డౌన్‌లోడ్ స్పీడ్ అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ ‘వర్క్ @ హోమ్’ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ ప్రారంభంలో ఏప్రిల్ 19 వరకు ఒక నెల వాలిడిటీ అందించారు. 

also read  వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్.. డబుల్ డేటా ఆఫర్‌ తో ఫ్రీ సబ్ స్క్రిప్షన్ కూడా...

బిఎస్ఎన్ఎల్ తమిళనాడు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వర్క్ @ హోమ్ ప్రమోషనల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వాలిడిటీని మే 19 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మొదట  తన ల్యాండ్ లైన్ సబ్ స్క్రైబర్ల కోసం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను ఏప్రిల్ 19 వరకు  అంటే ఒక నెల వాలిడిటీతో ప్రారంభించింది. ఇది అండమాన్ & నికోబార్ సర్కిల్‌తో సహా అన్ని సర్కిల్‌లలో ప్రారంభమైంది. 


ప్రయోజనాల పరంగా బిఎస్ఎన్ఎల్ రూపొందించిన వర్క్ @ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 10 జిబిపిఎస్ స్పీడ్ తో 5 జిబి డాటాను అందిస్తుంది. డాటా పరిమితిని మించితి 1Mbps స్పీడ్ కు  పడిపోతుంది.  ప్రస్తుతం ఉన్న వాయిస్ కాలింగ్ సబ్ స్క్రిప్షన్ లో ఎటువంటి మార్పులు ఉండవు, ల్యాండ్‌లైన్ ప్లాన్ ప్రకారం కాల్ ఛార్జీలు ఉంటాయి.

Follow Us:
Download App:
  • android
  • ios