వోడాఫోన్ ఐడియా డబుల్ డేటా ఆఫర్‌ను రూ. 299, రూ. 449, రూ. 699 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పై అదిస్తుంది. అంతకు ముందు ఉన్న రెండు ప్లాన్లలాగానే వోడాఫోన్ ఐడియా తొమ్మిది టెలికాం సర్కిల్‌లలో ఈ డబుల్ డేటా ఆఫర్ ప్రవేశపెట్టింది.

ఇది ప్రస్తుతం అన్నీ రాష్టాలకు అందుబాటులో లేదు. ఈ ప్లాన్ ద్వారా వొడాఫోన్ ప్లే, జీ5, ఐడియా మూవీస్ & టివి కంటెంట్‌లను వోడాఫోన్, ఐడియా యాప్‌ల ద్వారా ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా ఇస్తుంది.

వోడాఫోన్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ డబుల్ డేటా ఆఫర్‌ రూ. 299, రూ. 449, రూ. 699 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వివరాలను వెల్లడించింది. ఈ ఆఫర్ అంతకుముందు రూ. 399, రూ. 599 ప్రీపెయిడ్ ప్లాన్ వారికి కూడా వర్తిస్తుంది. 

వోడాఫోన్ ఐడియా డబుల్ డేటా ఆఫర్‌ను రూ. 249, రూ. 399, రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ పై మార్చి నుండి  ప్రారంభించింది. ఇది ప్రారంభించిన సమయంలో మొత్తం 22 టెలికాం సర్కిల్‌లలో అందుబాటులో ఉంది. అయితే, గత వారం ఎనిమిది టెలికాం సర్కిళ్లలో డేటా ఆఫర్‌ను నిలిపివేసింది.

also read కరోనా ఎఫెక్ట్: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఒక ‘వర్క్ ఫ్రం హోం’ 

డబుల్ డేటా ఆఫర్ ద్వారా పొందే తాజా ప్రయోజనాలు

అధికారిక సైట్ ప్రకారం, డబుల్ డేటా ఆఫర్ ద్వారా అదనంగా 2జి‌బి హై-స్పీడ్ డైలీ డేటా ప్రయోజనాలను రూ. 299, రూ. 449, రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్ పై అందిస్తుంది. రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా అదనపు హై-స్పీడ్ డేటా ప్రయోజనాలతో రోజుకు మొత్తం  4జి‌బి హై-స్పీడ్ డేటా పొందుతారు. 

ఈ ప్లాన్ ద్వారా 28 రోజుల పాటు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లు పొందుతారు. రూ. 449 ప్రీపెయిడ్ ప్లాన్  ద్వారా 54 రోజుల వాలిడిటీతో రోజుకి 4జి‌బి హై-స్పీడ్ డైలీ డేటా యాక్సెస్‌తో పాటు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు.

అదేవిధంగా, రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్‌ ద్వారా రోజుకు మొత్తం 4 జిబి హై-స్పీడ్ డేటాతో పాటు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్ లు 84 రోజులు వాలిడిటీ ఉంటుంది.