అతిపెద్ద బ్యాటరీతో రియల్‌మీ కొత్త స్మార్ట్ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే ?

ఇండోనేషియాలో ఇప్పటికే అడుగుపెట్టిన ఈ ఫోన్ ఆగస్టు 18న మధ్యాహ్నం 12:30 గంటలకు వర్చువల్ ఈవెంట్ ద్వారా ఇండియాలో లాంచ్ అవుతుంది. అంతకుముందు ఈ ఫోన్‌ కంపెనీ ఇండియా సపోర్ట్ పేజీలో కనిపించింది, రియల్ మీ ఇండియా వెబ్‌సైట్ ద్వారా ఫోన్‌ను టీజ్ చేసింది. 

Realme C15 Launching in India on August 18

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ బడ్జెట్ ధరకే మంచి హార్డ్‌వేర్‌ను అందించే ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ శ్రేణికి రియల్‌ మీ సి15 త్వరలో చేర్చనుంది. ఇండోనేషియాలో ఇప్పటికే అడుగుపెట్టిన ఈ ఫోన్ ఆగస్టు 18న మధ్యాహ్నం 12:30 గంటలకు వర్చువల్ ఈవెంట్ ద్వారా ఇండియాలో లాంచ్ అవుతుంది.

అంతకుముందు ఈ ఫోన్‌ కంపెనీ ఇండియా సపోర్ట్ పేజీలో కనిపించింది, రియల్ మీ ఇండియా వెబ్‌సైట్ ద్వారా ఫోన్‌ను టీజ్ చేసింది. రియల్‌మీ సి15 తో పాటు, రియల్‌మీ సి12 ను కూడా ఈ కార్యక్రమంలో కంపెనీ విడుదల చేస్తుంది.


భారతదేశంలో రియల్‌మీ సి15 ధర (అంచనా)
భారతదేశంలో రియల్‌మీ సి15 ధర ఇండోనేషియాలోని ధరలకు అనుగుణంగా ఉంటుంది. బేస్  వేరియంట్ 3జిబి + 64జిబి స్టోరేజ్ ధర ఇండోనేషియాలో ఐడిఆర్ 1,999,000 ఇండియాలో సుమారు రూ. 10,100 ఉండొచ్చని అంచనా. 4జిబి + 64జిబి స్టోరేజ్ వేరియంట్ ధర ఐడిఆర్ 2,199,000 అంటే ఇండియాలో సుమారు రూ. 11,100 ఉండొచ్చని అంచనా. టాప్-ఎండ్ వేరియంట్ 4 జిబి + 128 జిబి స్టోరేజ్ మోడల్ ఐడిఆర్ 2,499,000 ఇండియాలో సుమారు రూ .12,700 ఉండనుంది.

also read జియోఫై స్వాతంత్య్ర దినోత్సవం ఆఫర్‌.. 5 నెలల పాటు ఫ్రీ 4జీ డేటా, కాల్స్.. ...
    

రియల్‌మీ సి 15 ఫీచర్స్ 
రియల్‌మీ సి 15  ఇండియన్ వేరియంట్ ఫీచర్స్ కూడా ఇండోనేషియా వెర్షన్‌తో సమానంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌లో ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 18W క్విక్ ఛార్జ్ సపోర్ట్‌తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. కొన్ని నివేదికల ప్రకారం ఫోన్ ఆండ్రాయిడ్ 10తో రియల్‌మీ యుఐతో పనిచేస్తుంది.

720x1,600 పిక్సెల్స్ రిజల్యూషన్, 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.5-అంగుళాల హెచ్‌డి + డిస్ ప్లే ఉంటుందని భావిస్తున్నారు. రియల్‌మీ సి15 ఇండోనేషియా వెర్షన్ మీడియాటెక్ హెలియో జి35 మొబైల్ ప్లాట్‌ఫామ్‌తో పనిచేస్తుంది, ఇండియన్ వేరియంట్‌లో కూడా అదే ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది.
 
4జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్, మైక్రో ఎస్‌డి కార్డ్ సపోర్ట్  కూడా ఉంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్, ఇందులో ఎఫ్/2.2 లెన్స్‌తో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్ యాంగిల్ ఎఫ్/2.25 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2- మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా, మరొక 2-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా రావచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక భాగంలో ఉండొచ్చని భావిస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios