Asianet News TeluguAsianet News Telugu

బిఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.. 1 సంవత్సర వాలిడిటీతో ఫ్రీ కాల్స్, డాటా..

ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు ఉంటుంది. రీఛార్జ్ కాంబోలో రోజుకు 250 నిమిషాలు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 2 జిబి డైలీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు  ఫ్రీబీస్ గా పొందుతారు. 

BSNL Launches Rs.365 Prepaid Recharge Plan With Year-Long Validity and daily data
Author
Hyderabad, First Published Nov 2, 2020, 2:13 PM IST

ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికం ఆపరేటర్ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) కొన్ని టెలికాం సర్కిల్‌లలో కొత్తగా రూ.365 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు ఉంటుంది.

రీఛార్జ్ కాంబోలో రోజుకు 250 నిమిషాలు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 2 జిబి డైలీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు  ఫ్రీబీస్ గా పొందుతారు. అయితే ఈ ఫ్రీబీస్ కేవలం 60 రోజుల వాలిడిటీ ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ ఛత్తీస్‌ ఘడ్ సర్కిల్‌లో రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా తీసుకోచ్చింది.

ఈ ప్లాన్ ఎలాంటి డేటాను ఆఫర్ అందించారు కాని 600 రోజులపాటు వాలిడిటీ అందిస్తుంది. కొత్త బీఎస్‌ఎన్‌ఎల్ రూ.365 రీఛార్జ్ ప్లాన్ కేరళ వెబ్‌సైట్‌లో ప్రదర్శించరు, అయితే ఈ ప్లాన్ ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్-జార్ఖండ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, కోల్‌కతా- పశ్చిమ బెంగాల్, ఈశాన్య, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ - ఛత్తీస్‌ ఘడ్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు - చెన్నై, యుపి-ఈస్ట్, యుపి-వెస్ట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. 

కొత్త రూ.365ప్లాన్ రోజుకు 250 నిమిషాల (ముంబై, ఢీల్లీతో సహా లోకల్ / ఎస్‌టి‌డి / నేషనల్ రోమింగ్) ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తుంది. రోజుకు 250 నిమిషాల ఉచిత వాయిస్ కాల్ పరిమితిని చేరుకున్న తరువాత, బేస్ ప్లాన్ టారిఫ్ ప్రకారం ఛార్జీలు వర్తిస్తాయి.

also read నవంబర్‌లో లాంచ్ కానున్న బెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్‌ఫోన్‌లు ఇవే ...

రోజుకు 2జి‌బి వరకు ఆన్ లిమిటెడ్ హై స్పీడ్ డేటా ప్రయోజనంతో అందిస్తుంది. 2జి‌బి లిమిట్ చేరుకున్న తరువాత, డేటా స్పీడ్ 80కే‌బి‌పి‌ఎస్ కు పడిపోతుంది. ఈ ప్లాన్ రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లను అందిస్తుంది.

పి‌ఆర్‌బి‌టి బండ్లింగ్, సిటాప్ అప్, ఆన్‌లైన్ రీఛార్జ్‌ ద్వారా మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఎస్‌ఎం‌ఎస్ లేదా యూ‌ఎస్‌ఎస్‌డి ద్వారా రీఛార్జ్‌ అందుబాటులో  లేదు. ఫ్రీబీస్ వాలిడిటీ 60 రోజులు, ప్లాన్ వాలిడిటీ 365 రోజులు.

60 రోజుల ఫ్రీబీస్ వాలిడిటీ ముగిసిన తరువాత వాయిస్, డేటా సదుపాయాన్ని ఉపయోగించడానికి కస్టమర్లు వాయిస్, డేటా వోచర్‌లను జోడించాల్సి ఉంటుంది.  

ఛత్తీస్‌ఘడ్ సర్కిల్‌లో బిఎస్‌ఎన్‌ఎల్ తాజాగా 600 రోజుల వాలిడిటీతో రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ భారతదేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అవుట్‌గోయింగ్ కాల్స్ రోజుకు 250 నిమిషాల ఎఫ్‌యుపి లిమిట్ అందిస్తుంది.

మీరు రోజుకు 100 ఉచిత ఎస్‌ఎం‌ఎస్ లను పొందుతారు, కాని ఈ ప్లాన్‌తో ఎలాంటి డేటా అందించాదు కాబట్టి మీరు సాధారణ డేటా చార్జెస్ చెల్లించాల్సి ఉంటుంది లేదా డేటా కోసం యాడ్-ఆన్ ప్యాక్‌ని రిచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios