బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు క్రిస్మస్, న్యూ ఇయర్ ఆఫర్...
బిఎస్‌ఎన్‌ఎల్ రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ను సవరించింది. రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 365 రోజులకు బదులుగా 425 రోజులకు వాలిడిటీని పెంచింది.బిఎస్‌ఎన్‌ఎల్ టెలికాం ఆపరేటర్ ఈ ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీని అదనంగా మరో 60 రోజులు పెంచారు.
క్రిస్మస్ మరియు కొత్త సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నెట్వర్క్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఒక కొత్త లాభదాయకమైన ఆఫర్లను ప్రకటించింది. బిఎస్‌ఎన్‌ఎల్ టెలికాం ఆపరేటర్ ఈ ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీని అదనంగా మరో 60 రోజులు పెంచారు.
ఈ ఆఫర్ డిసెంబర్ 25 నుంచి అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ కస్టమర్లకు 365 రోజుల వాలిడిటీకి బదులుగా కంపెనీ 425 రోజుల వాలిడిటీని అందిస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్ నెట్వర్క్ క్రిస్మస్, న్యూ ఇయర్ లో భాగంగా రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ప్రారంభించి, నెట్వర్క్ 60 రోజుల అదనపు వాలిడిటీని అందించాలనుకుంది.
also read ఒప్పో నుండి కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్...ధర ఎంతంటే...
ఈ రిచార్జ్ ప్యాక్ ఆఫర్ ప్రస్తుతం రోజుకు 3GB హై-స్పీడ్ డేటా, ఏదైనా నెట్‌వర్క్‌కు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్ లను అందిస్తుంది. వాలిడిటీతో పాటు, బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్, బిఎస్ఎన్ఎల్ టివి సుబ్స్క్రిప్షన్ వంటి అదనపు ఫీచర్లను 365 రోజులు ప్యాక్ లో చేర్చాలని చూస్తోంది.
ఇంకా, బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ రెండు ప్రత్యేక రీఛార్జ్‌లపై అదనపు టాక్‌టైమ్‌ను కూడా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఉదాహరణకు, రూ. 450 ప్లాన్‌లో రూ. 500 టాక్‌టైమ్, రూ. 275 రీఛార్జికు రూ. 250 టాక్‌టైమ్‌ను అందిస్తుంది. ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ గ ఉంటుంది, ఇది జనవరి 2 తో ఆఫర్ అయిపోతుంది.
also read ఆర్‌బిఐ నుండి కొత్త ప్రీపెయిడ్ పేమెంట్ .....10వేల వరకు ....
బిఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల కొత్త రూ. 365 మరియు రూ. 97 ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. రూ. 365 బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా డేలీ 2 జిబి హై-స్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్ లు, ఆన్ లిమిటెడ్ లోకల్, ఎస్‌టిడి మరియు రోమింగ్ కాల్స్ (ముంబై మరియు ఢిల్లీ సర్కిల్‌లతో సహా) చేసుకోవచ్చు. ప్రీపెయిడ్ ప్లాన్‌లో రింగ్ బ్యాక్ టోన్ (పిఆర్‌బిటి) యాక్సెస్ కూడా ఉంది. మరోవైపు రూ. 97 బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ 2 జిబి హై-స్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్ లను 18 రోజులు వాలిడిటీ ఉంటుంది.