ఒప్పో నుండి రెండు కొత్త 5g స్మార్ట్ ఫోన్లు....లేటెస్ట్ అప్ డేట్ ఫీచర్స్ తో..

. చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒప్పో రెండు కొత్త 5g స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది.కొత్తగా రెనో 3 సిరీస్‌ లో భాగంగా ఒప్పో రెనో 3, ఒప్పో రెనో 3 ప్రో అనే రెండు కొత్త ఫోన్‌లను లాంచ్ చేసింది. చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒప్పో రెనో 3 మరియు ఒప్పో రెనో 3 ప్రో డ్యూయల్-మోడ్ 5జి సపోర్ట్, క్వాడ్ రియర్ కెమెరా దీని ప్రత్యేకత.
 

oppo launches two 5g smart phones in china

చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో రెండు కొత్త 5g స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది.కొత్తగా రెనో 3 సిరీస్‌ లో భాగంగా ఒప్పో రెనో 3, ఒప్పో రెనో 3 ప్రో అనే రెండు కొత్త ఫోన్‌లను లాంచ్ చేసింది. చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒప్పో రెనో 3 మరియు ఒప్పో రెనో 3 ప్రో డ్యూయల్-మోడ్ 5జి సపోర్ట్, క్వాడ్ రియర్ కెమెరా దీని ప్రత్యేకత. ఒప్పో రెనో 3 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1000 ఎల్ 5జి ఎస్‌ఓ‌సి టెక్నాలజితో వస్తున్న మొదటి ఫోన్, ఒప్పో రెనో 3ప్రో స్నాప్‌డ్రాగన్ 765 జి ఎస్‌ఓ‌సి టెక్నాలజితో వస్తుంది. 

ఒప్పో రెనో 3 ధర..
ఒప్పో రెనో 3 ఫోన్ ఫీచర్స్ వచ్చేసి  8GB + 128GB వేరియంట్‌కు ఒప్పో రెనో 3 ధర CNY 3,399 (సుమారు రూ. 34,000) కాగా, హై-ఎండ్ 12GB + 128GB మోడల్ ధర CNY 3,699 (సుమారు రూ. 36,999) ధరను కలిగి ఉంది. ఇది చైనాలో డిసెంబర్ 31 నుండి అందుబాటులో ఉంటుంది, అయితే భారతదేశంతో సహా అంతర్జాతీయ మార్కెట్లలో దీని లభ్యత పై ఎలాంటి సమాచారం లేదు. మిస్టి వైట్, మూన్ నైట్ బ్లాక్, సన్‌రైజ్ ఇంప్రెషన్ మరియు బ్లూ స్టార్రి నైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

also read  ఒప్పో నుండి కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్...ధర ఎంతంటే...


ఒప్పో రెనో 3 ప్రో ధర
ఒప్పో రెనో 3ప్రో ఫీచర్స్ 8GB + 128GB మోడల్‌ ధర CNY 3,999 (సుమారు రూ .40,000) కాగా, టాప్-ఎండ్ 12GB + 256GB కాన్ఫిగరేషన్  ధర CNY 4,499 (సుమారు రూ .45,000). ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం చైనాలో డిసెంబర్ 31 నుండి మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది. అయితే హై-ఎండ్ వేరియంట్ జనవరి 10 నుండి అందుబాటులో ఉంటుంది. ఇది మిస్టి వైట్, మూన్ నైట్ బ్లాక్, సన్‌రైజ్ ఇంప్రెషన్ మరియు బ్లూ స్టార్రి నైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

 

oppo launches two 5g smart phones in china


ఒప్పో రెనో 3 ప్రో పాంటోన్ ఎడిషన్
ఒప్పో రెనో 3 ప్రో కొత్త పాంటోన్ ఎడిషన్‌ను క్లాసిక్ బ్లూ షేడ్‌లో లాంచ్ చేసింది. దీని ధర సిఎన్‌వై 4,199 (సుమారు రూ. 42,000) , జనవరి 10 నుండి అమ్మకాలు ప్రారంభమవుతాయి. 


ఒప్పో రెనో 3 ప్రో స్పెసిఫికేషన్లు
ఒప్పో రెనో 3 ప్రో  డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10 కలర్‌ఓఎస్ 7 స్కిన్‌, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 800 నిట్స్ (హెచ్‌బిఎం), 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డి + (1080 x 2400 పిక్సెల్స్) , అమోలెడ్ డిస్‌ప్లే, 5000000: 1 కాంట్రాస్ట్ రేషియో, 93.4 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, హెచ్‌డిఆర్ 10 + సపోర్ట్ ఉన్నాయి. ఒప్పో రెనో 3 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జి SoC కలిగి ఉంది.

also read  ఆర్‌బిఐ నుండి కొత్త ప్రీపెయిడ్ పేమెంట్ .....10వేల వరకు ....

ఒప్పో రెనో 3 ప్రోలో  క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌, సోనీ IMX586 సెన్సార్, ఎఫ్ / 1.7 ఎపర్చర్‌, 48 మెగాపిక్సెల్ షూటర్ ఉంది. దీనితో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ,116-డిగ్రీల ఫీల్డ్ వ్యూతో, 13 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో EIS మరియు 5x హైబ్రిడ్ జూమ్ సపోర్ట్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరాతో f / 2.4 ఎపర్చర్‌ ఉంటుంది. ఫోన్ 1080p స్లో-మో వీడియోలను 120fps వద్ద షూట్ చేయగలదు. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా, హోల్-పంచ్ లోపల ఎఫ్ / 2.4 లెన్స్‌తో ఉంటుంది.


తాజా ఒప్పో ఫోన్ వి‌ఓ‌ఓ‌సి ఫ్లాష్ ఛార్జ్ 4.0 సపోర్ట్ తో 4,025mAh బ్యాటరీతో వస్తుంది. దీనికి ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. మల్టీ-ఫంక్షన్ ఎన్‌ఎఫ్‌సి కి సప్పోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఫీచర్లలో 5జి, 4 జి వోల్టిఇ, బ్లూటూత్ 5.1, వై-ఫై ఎ / బి / జి / ఎన్ / ఎసి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, బీడౌ, గ్లోనాస్, గెలీలియో ఉన్నాయి. ఫోన్‌లోని సెన్సార్‌లు కొంపాస్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రోక్సిమిటి సెన్సార్, యాక్సిలెరోమీటర్, గ్రావిటీ సెన్సార్, గైరోస్కోప్ మరియు పెడోమీటర్.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios