ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బిఎస్‌ఎన్‌ఎల్ తాజాగా రంజాన్, ఈద్ 2020 స్పెషల్ సందర్భంగా తమ వినియోగదారుల కోసం రూ. 786 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్  లాంచ్ చేసింది. ఈ ప్రమోషనల్  ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రూ. 786 పూర్తి టాక్‌టైమ్, 30 జీబీ హై-స్పీడ్ డేటా, 90 రోజుల వాలిడిటీ ఇస్తుంది.

ఈద్, రంజాన్ సందర్భంగా ప్రతి సంవత్సరం బిఎస్‌ఎన్‌ఎల్ రూ.786 రీఛార్జ్ ప్లాన్ ను  సంప్రదాయంగా తీసుకొస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్  గతంలో కూడా ఇలాంటి ప్రీపెయిడ్ ప్లాన్ ను ఇతర ప్రయోజనాలతో విడుదల చేసింది.

కొత్త బిఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌తో సహా ఎంపిక చేసిన సర్కిల్‌లలో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. బిఎస్‌ఎన్‌ఎల్  సంస్థ ఆవిష్కరించిన మరో ప్లాన్ ధర 699 రూపాయలు. వీటితో పాటు కంపెనీ  ఇప్పటికే ఎస్‌టివి 118, కాంబో 18 ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. 

also read ఒక్క సెకనులోపు వెయ్యి హెచ్‌డి సినిమాలు డౌన్‌లోడ్.. ప్రపంచంలోనే ఫాస్ట్ ఇంటర్నెట్...! ...


బిఎస్‌ఎన్‌ఎల్ రూ. 786 రీఛార్జ్ ప్లాన్ పూర్తి వివరాలు ఇంకా  లభ్యత
బిఎస్‌ఎన్‌ఎల్ కేరళ అధికారిక ట్విట్టర్‌లో ద్వారా దీనిని ప్రకటించింది. కొత్త రూ. 786 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఈ రోజు ప్రత్యక్షంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.  జూన్ 21 వరకు అందుబాటులో ఉంటుంది.ఈ ప్లాన్ ద్వారా రూ. 786 ఫుల్ టాక్‌టైమ్, 30 జీబీ డేటా, 90 రోజుల వరకు వాలిడిటీ ఉంటుంది.

మీరు బిఎస్ఎన్ఎల్ కస్టమర్లయితే ఈ ప్లాన్ మీకు ఆసక్తి కలిగి ఉంటే, మీరు ఇప్పుడు మీ ప్రీపెయిడ్ బిఎస్ఎన్ఎల్ ఖాతాను రీఛార్జ్ చేయడానికి బిఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్, యాప్ లేదా ఏదైనా థర్డ్ పార్టీ రీఛార్జ్ సేవల ద్వారా చేసుకోవచ్చు.