గ్యాస్‌ కస్టమర్లకు గుడ్ న్యూస్.. వాట్సప్ ద్వారా సిలిండర్ బుకింగ్...

దేశంలోని భారత్ గ్యాస్ కస్టమర్లు అందరూ ఇక వాట్సప్ ద్వారా సులువుగా సిలిండర్ బుక్ చేయొచ్చు. ప్రస్తుత భారత్ గ్యాస్‌ కస్టమర్ల సంఖ్య 7.1 కోట్లు. ఇండియన్ ఆయిల్ తర్వాత భారత్ గ్యాస్‌కు ఎక్కువ మంది ఎల్‌పీజీ కస్టమర్లు ఉన్నారు. 

bpcl launches new feature for cooking gas booking by whatsapp

ఇంట్లో సిలిండర్ వాడే వారికి గుడ్ న్యూస్. ఇక మీరు సిలిండర్ బుక్ చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీ ఫోన్‌లో వాట్సప్ ఉంటే చాలు, ఈజీగా సిలిండర్ బుక్ చేయొచ్చు. ఇకపై వాట్సప్ ద్వారా కూడా సిలిండర్ బుక్ చేయొచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మెసేజ్ చేస్తే చాలు.

సాధారణంగా వంట గ్యాస్ సిలిండర్‌ను సంబంధిత గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్లిగానీ, లేదా ఫోన్ ద్వారా బుకింగ్ చేసుకుంటాం. అయితే ఇకపై వాట్సాప్‌ నుంచి కూడా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(బీపీసీల్) అందుబాటులోకి తీసుకొచ్చింది.ఎలా అనుకుంటున్నారా.

  భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-బి‌పి‌సి‌ఎల్ ఈ కొత్త విధానాన్ని ప్రారంభించింది. దేశంలోని భారత్ గ్యాస్ కస్టమర్లు అందరూ ఇక వాట్సప్ ద్వారా సులువుగా సిలిండర్ బుక్ చేయొచ్చు. ప్రస్తుత భారత్ గ్యాస్‌ కస్టమర్ల సంఖ్య 7.1 కోట్లు. ఇండియన్ ఆయిల్ తర్వాత భారత్ గ్యాస్‌కు ఎక్కువ మంది ఎల్‌పీజీ కస్టమర్లు ఉన్నారు.

also read ముకేశ్ అంబానీ ముందుచూపు.. విదేశీ స్టాక్​ ఎక్స్ఛేంజీల్లో జియో లిస్టింగ్​!

ఈ కస్టమర్లు వాట్సప్ నుంచి సిలిండర్ బుక్ చేయడానికి బీపీసీఎల్ స్మార్ట్‌లైన్ నెంబర్‌ను ప్రారంభించారు. కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 1800224344 నెంబర్‌కు వాట్సప్‌లో మెసేజ్ చేస్తే చాలు. సిలిండర్ బుక్ అవుతుంది.


  వాట్సప్ ద్వారా ఎల్‌పీజీ బుక్ చేయడం కస్టమర్లకు చాలా సులువు. పిల్లల నుంచి పెద్దల వరకు వాట్సప్ సాధారణంగా ఉపయోగించే యాప్‌గా మారిపోవడంతో, ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి సిలిండర్ బుక్ చేసే సదుపాయాన్ని కస్టమర్లకు కల్పిస్తున్నాం, అలాగే డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులతో పాటు యూపీఐ చెల్లింపులను కూడా కల్పించినట్లు బీపీసీఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ అరుణ్ సింగ్ అన్నారు. 


ఇక బీపీసీల్ కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి 1800224344 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చునని సూచించింది. ఇందుకు ముందుగా బీపీసీఎల్ స్మార్ట్‌లైన్ నెంబర్‌ 1800224344 సేవ్ చేసుకోవాలి. మొదట Hi అని మెసేజ్ చేయాలి.

ఆ తర్వాత Book లేదా 1 అని మెసేజ్ చేయాలి. తర్వాత బుకింగ్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ మెసేజ్‌లో పేమెంట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, ఇతర వ్యాలెట్స్ ద్వారా పేమెంట్ చేయొచ్చు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios