Asianet News TeluguAsianet News Telugu

ముకేశ్ అంబానీ ముందుచూపు.. విదేశీ స్టాక్​ ఎక్స్ఛేంజీల్లో జియో లిస్టింగ్​!

జియో ప్లాట్​ఫామ్స్​ను విదేశాల్లో లిస్టింగ్ చేసే యోచనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే 12-24 నెలల్లో ఈ ఇష్యూ రావొచ్చని అనుకుంటున్నారు. అయితే ఎక్కడ నమోదు చేయాలన్నది కంపెనీ ఇంకా నిర్ణయించలేదని ఈ వ్యవహారాలతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి తెలిపారు.
 

Mukesh Ambani prepares Facebook-backed Jio Platforms for overseas IPO
Author
Hyderabad, First Published May 27, 2020, 12:42 PM IST

న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన డిజిటల్‌, వైర్‌లెస్‌ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ను విదేశాల్లో లిస్టింగ్‌ చేయాలనే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. నెల రోజుల్లోనే సుమారు రూ.78,000 కోట్ల (10 బిలియన్‌ డాలర్లు)కు పైగా పెట్టుబడులను ఆకర్షించిన జియో ప్లాట్‌ఫామ్స్‌ భారత్‌ వెలుపలి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయాలని రిలయన్స్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ భావిస్తున్నట్లు సమాచారం.

రాబోయే 12-24 నెలల్లో రిలయన్స్ జియో విదేశీ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ దాఖలు రావొచ్చునని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే ఎక్కడ నమోదు చేయాలన్నది కంపెనీ ఇంకా నిర్ణయించలేదని ఈ వ్యవహారాలతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి తెలిపారు. త్వరితగతిన పెట్టుబడులను ఆకర్షించి తమ సంస్థను రుణ రహితంగా తీర్చిదిద్దాలని రిలయన్స్ అధినేత యోచిస్తున్నారు.

also read వెంటాడుతున్న కరోనా కష్టాలు: బయటపడేందుకు స్టార్టప్‌లు.. కొత్త ఉద్యోగుల నియామకం

విదేశీ స్టాక్ మార్కెట్లలో ఐపీవోకు వెళ్లే సమయం, ఇష్యూ పరిమాణంపై ఇంకా తుది నిర్ణయం జరగలేదని వివరించారు. ఇటీవల ఫేస్‌బుక్‌, సిల్వల్‌ లేక్‌ పార్టనర్స్‌, జనరల్‌ అట్లాంటిక్‌ తర్వాత తాజాగా జియో ప్లాట్‌ఫాయ్స్‌లో కేకేఆర్‌ అండ్‌ కో పెట్టుబడులు పెట్టింది. విదేశాల్లో లిస్టింగ్‌ వల్ల అధిక విలువ దక్కవచ్చని, ప్రస్తుత పెట్టుబడుదారులు నిష్క్రమించడానికి, ఇలా ఒక అవకాశం ఇవ్వవచ్చని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

విదేశీ స్టాక్ మార్కెట్లలో జియో ప్లాట్‌ఫామ్స్‌ను లిస్టింగ్ చేసే విషయమై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తమ ఆన్‌లైన్‌ సరకుల వ్యాపారాన్ని జియోమార్ట్‌ బ్రాండ్‌ కింద 200 నగరాల్లో ప్రారంభించింది.

దేశంలోని ప్రధాన మెట్రో నగరాలు ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాలతో పాటు మైసూరు, భటిండా, డెహ్రాడూన్ వంటి చిన్న పట్టణాల్లోనూ సేవలు అందిస్తున్నట్లు జియోమార్ట్ ప్రకటించింది. జియో మార్ట్‌ ఇప్పుడు 200కు పైగా నగరాల్లో సేవలు అందిస్తోందని రిలయన్స్‌ రిటైల్‌ గ్రోసరీ విభాగం సీఈఓ దామోదర్‌ మాల్‌ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios