ఎలెక్త్రోనిక్ ఆడియో బ్రాండ్‌ బోట్ రాకర్జ్ 335 వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్ ఇండియాలో లాంచ్ చేసింది. కొత్త బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు కంపెనీ  వైర్‌లెస్ ఆడియో ఉత్పత్తులలో అత్యంత అధునాతనమైనది. బోట్ రాకర్జ్ 335 వన్‌ప్లస్ బ్రాండ్ బుల్లెట్ వైర్‌లెస్ జెడ్‌ ఇయర్‌ఫోన్స్ కు  పోటీగా ఉంటుంది. ఇది రెడ్, యెల్లో, బ్లూ మూడు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.

బోట్ రాకర్జ్ 335 ధర
బోట్ రాకర్జ్ 335 ఇయర్ ఫోన్స్ కంపెనీ  యొక్క ఖరీదైన వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌లలో ఒకటి. ఈ ఇయర్‌ఫోన్‌లు వన్‌ప్లస్ బ్రాండ్ బుల్లెట్ వైర్‌లెస్ జెడ్ అలాగే ఒప్పో ఎంకో ఎం31  ఇయర్‌ఫోన్‌లకు పోటీగా తీసుకొచ్చింది. దీని ధర రూ. 1,999.

also read  బడ్జెట్ ధరకే అదిరిపోయే ఫీచర్లతో పోకో ఎం2 కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ...

బోట్ రాకర్జ్ 335 ఫీచర్స్ 
బోట్ రాకర్జ్ 335  ఇయర్ ఫోన్స్ ఒక్కసారి చార్జ్ చేస్తే 30 గంటల వరకు మ్యూజిక్ వినడం లేదా కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, 10 నిమిషాల ఛార్జ్‌తో 10 గంటల వరకు మ్యూజిక్ వినొచ్చు.

ఇయర్ ఫోన్స్ మొత్తం ఛార్జ్ కావడానికి కేవలం 40 నిమిషాలు పడుతుంది. యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్ ద్వారా ఛార్జింగ్ చేయవచ్చు. ఇయర్‌ఫోన్‌లలో 10 ఎంఎం డ్రైవర్లు, కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0 ఉన్నాయి. వాటర్ రిసిస్టంట్  IPX5 రేట్, హెడ్‌సెట్ నెక్‌బ్యాండ్‌పై కంట్రోల్ బటాన్స్ వస్తాయి.