Asianet News TeluguAsianet News Telugu

బెస్ట్ ఫీచర్స్ తో 20వేలలో లభించే స్మార్ట్ ఫోన్ ఏదో తెలుసా..

 స్మార్ట్ ఫోన్ మనదేశంలో జూన్ లో లాంచ్ అయ్యింది. దీనికి వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా 64 మెగా పిక్సెల్ కాగా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అమర్చారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.

best phone under 20k is Motorola One Fusion+ to
Author
Hyderabad, First Published Aug 10, 2020, 2:09 PM IST

లేనోవో యజమాన్యంలోని మోటొరోలా వన్ ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో జూన్ లో లాంచ్ అయ్యింది. దీనికి వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా 64 మెగా పిక్సెల్ కాగా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అమర్చారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.

మోటొరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ ధర
ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. లాంచ్ చేసినపుడు దీని ధరను రూ.16,999గా నిర్ణయించారు. అయితే తర్వాత రూ.500 పెంచారు. దీంతో ఇప్పుడు ఈ ఫోన్ ధర రూ.17,499. ట్విలైట్ బ్లూ, మూన్ లైట్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ ను లాంచ్ అయింది.

also read సురక్షితమైన పేమెంట్ల కోసం పేటీఎం కొత్త పాకెట్-సైజ్ డివైజ్ లాంచ్‌.. ...

మోటొరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సింగిల్ వెరీఎంట్ అందించారు. హైబ్రిడ్ మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా దీని స్టోరేజ్ 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730జీ ప్రాసెసర్ తో పనిచేస్తుంది.

ఫోన్ వెనక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. వెనకవైపు నాలుగు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా 64 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లను ఇందులో అందించారు.

సెల్ఫీ కోసం ముందువైపు 16 మెగా పిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 15W ఫాస్ట్ చార్జింగ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. డ్యూయల్ 4జీ వి‌ఓ‌ఎల్‌టి‌ఈ, వై-ఫై, బ్లూటూత్ వి5, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 210 గ్రాములు.

Follow Us:
Download App:
  • android
  • ios