Asianet News TeluguAsianet News Telugu

వచ్చేస్తోంది ఫేస్‌బుక్‌ న్యూస్.. ఇండియాలో వారికి కంటెంట్‌కు తగ్గ పేమెంట్లు కూడా..

వివిధ దేశాల్లో ఫేస్‌బుక్ న్యూస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు కంటెంట్ కంటెంట్‌కు తగ్గ డబ్బులు చెల్లించనుంది. ఫేస్‌బుక్ న్యూస్‌ను మరిన్ని దేశాలకు తీసుకువస్తామని కంటెంట్‌కు ప్రచురణకర్తలకు పారితోషికం కూడా చెల్లించనున్నట్లు సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ తెలిపింది.

Facebook soon to pay news publishers for their content  in India and other countries
Author
Hyderabad, First Published Aug 26, 2020, 6:33 PM IST

న్యూ ఢీల్లీ: సోషల్ మీడియా దిగ్గజం కంటెంట్ క్రియేటర్స్‌ వారికి గుడ్ న్యూస్  తెలిపింది.  వివిధ దేశాల్లో ఫేస్‌బుక్ న్యూస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు కంటెంట్ కంటెంట్‌కు తగ్గ డబ్బులు చెల్లించనుంది.

ఫేస్‌బుక్ న్యూస్‌ను మరిన్ని దేశాలకు తీసుకువస్తామని కంటెంట్‌కు ప్రచురణకర్తలకు పారితోషికం కూడా చెల్లించనున్నట్లు సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ తెలిపింది. గత ఏడాది యుఎస్‌లో ప్రారంభించిన ఫేస్‌బుక్ న్యూస్ త్వరలో యుకె, జర్మనీ, ఫ్రాన్స్, ఇండియా, బ్రెజిల్ దేశాలకు వచ్చే ఆరు నెలల నుంచి ఏడాదిలోపు విస్తరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

also read వోడాఫోన్ ఐడియాకు ట్రాయ్ షోకాజ్ నోటీసులు.. స్పందించాలంటూ ఆదేశం ...

ఫేస్‌బుక్ గ్లోబల్ న్యూస్ పార్టనర్షిప్స్ వి.పి. కాంప్‌బెల్‌ బ్రౌన్‌ తన బ్లాగులో కంటెంట్‌  క్రియేటర్స్‌, పబ్లిషర్లకు డబ్బు చెల్లించేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు."వినియోగదారుల  అభిరుచికి తగినట్లుగా న్యూస్ కంటెంట్‌ క్రియేట్‌ చేసి సరికొత్త బిజినెస్‌ మోడల్‌తో ముందుకు సాగనున్నట్లు వెల్లడించారు

. కాబట్టి మేము ప్రతి దేశంలోని న్యూస్ పార్టనర్షిప్ తో  కలిసి పని చేస్తాము. ప్రజలకు విలువైన అనుభవాన్ని అందించే మార్గాలను పరీక్షించడానికి, ప్రచురణకర్తల వ్యాపార నమూనాలను గౌరవించటానికి మేము కృషి చేస్తాము" అని బ్రౌన్ చెప్పారు.

ఫేస్‌బుక్ న్యూస్ ప్రచురణకర్తలకు అందించే ట్రాఫిక్‌లో 95 శాతానికి పైగా "న్యూస్ ఫీడ్ నుండి వారు ఇప్పటికే పొందిన ట్రాఫిక్‌కు పెరుగుదల" అని ఫేస్‌బుక్ కనుగొంది. "స్థిరమైన వార్తా పర్యావరణ వ్యవస్థను నిర్మించటానికి ఇన్నోవేషన్ చాలా కీలకం. వార్తా పరిశ్రమ దీర్ఘకాలిక వ్యాపార నమూనాలను నిర్మించడంలో సహాయపడటానికి మేము కొత్త ఉత్పత్తులను నిర్మించడం, ప్రపంచ పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తాము" అని ఆయన చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios