చైనాకు మళ్ళీ గట్టి షాక్.. ఈసారి ఏకంగా 39వేల చైనా గేమ్ యాప్‌లపై నిషేధం..

ఆపిల్ చైనా యాప్ స్టోర్‌ నుండి గురువారం 39వేల గేమ్ యాప్స్ తొలగించింది. ఇది ఒకే రోజులో ఇంత భారీ ఎత్తున్న యాప్స్ నిషేదించడం మొదటిసారి.

Apple removes 39,000 game apps and paid apps  from China store to meet deadline

భారత ప్రభుత్వం చైనాకి చెందిన వందల యాప్స్ నిషేదించిన తరువాత అమెరికన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్  చైనాకు భారీ షాక్ ఇచ్చింది.   ఆపిల్ చైనా యాప్ స్టోర్‌ నుండి గురువారం 39వేల గేమ్ యాప్స్ తొలగించింది.

ఇది ఒకే రోజులో ఇంత భారీ ఎత్తున్న యాప్స్ నిషేదించడం మొదటిసారి. 2020 ఏడాది చివరి రోజు వరకు తిరిగి లైసెన్స్‌ను పొందలేని కారణంగా యాప్ లను నిషేధించినట్లు పేర్కొంది. చైనా అధికారులు లైసెన్స్ లేని గేమ్స్ పై అణిచివేత మధ్య ఈ తొలగింపు వచ్చింది.

39వేల గేమ్ యాప్స్ తో సహా, ఆపిల్ గురువారం యాప్ స్టోర్ నుండి మొత్తం 46 వేల యాప్ లను తొలగించింది. ఈ నిషేధం ద్వారా ప్రభావితమైన గేమ్ యాప్స్ లో ఉబిసాఫ్ట్ టైటిల్ అస్సాస్సిన్ క్రీడ్ ఐడెంటిటీ, ఎన్‌బిఎ 2 కె 20 ఉన్నాయి అని పరిశోధనా సంస్థ కిమై తెలిపింది.

also read న్యూ ఇయర్ రోజున వాట్సాప్ సరికొత్త రికార్డు.. 50% పెరిగిన వాట్సాప్ ఆడియో, వీడియో కాల్స్.. ...

ఆపిల్ స్టోర్‌లో పేయిడ్ టాప్ 1,500 గేమ్స్ లో 74 మాత్రమే బయటపడ్డాయని కిమై తెలిపింది. అయితే ఆపిల్ ఈ నిషేధంపై వెంటనే స్పందించలేదు.

ప్రపంచంలోని అతిపెద్ద గేమింగ్ మార్కెట్లో యాప్స్ కొనుగోళ్లు చేయడానికి వినియోగదారులను అనుమతించే ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్ నంబర్‌ను సమర్పించడానికి ఆపిల్ మొదట్లో గేమ్ పబ్లిషర్స్ కి జూన్ చివరి వరకు గడువు ఇచ్చింది. తరువాత ఆపిల్ ఈ గడువును డిసెంబర్ 31కు పొడిగించింది.

చైనా  ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ చాలాకాలంగా లైసెన్సులపై నిబంధనలను పాటించాయి. ఈ సంవత్సరం ఆపిల్ వాటిని మరింత కఠినంగా ఎందుకు అమలు చేస్తోందో స్పష్టంగా తెలీదు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios