న్యూ ఇయర్ రోజున వాట్సాప్ సరికొత్త రికార్డు.. 50% పెరిగిన వాట్సాప్ ఆడియో, వీడియో కాల్స్..
గత సంవత్సరంతో పోల్చితే న్యూ ఇయర్ రోజున వాట్సాప్ వీడియో, వాయిస్ కాల్స్ 50 శాతం పెరిగినట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది.
గత ఏడాది 2020లో టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లలో అపూర్వమైన పెరుగుదల కనిపించింది. లాక్ డౌన్ సమయంలో ఇంటర్నెట్ వినియోగదారులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండటానికి ఎంతో సహాయపడింది.
గత సంవత్సరంతో పోల్చితే న్యూ ఇయర్ రోజున వాట్సాప్ వీడియో, వాయిస్ కాల్స్ 50 శాతం పెరిగినట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా 2020 సంవత్సరపు చివరి రోజు తరువాత న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలు వాట్సాప్ ద్వారా 140కోట్లకు పైగా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేశారని వాట్సాప్ తెలిపింది.
వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్‌బుక్ న్యూ ఇయర్ రోజున ప్రపంచవ్యాప్తంగా 55 మిలియన్లకు పైగా లైవ్ స్ట్రీమ్స్ జరిగాయని వెల్లడించింది. దీనికి సంబంధించి వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్‌బుక్ న్యూ ఇయర్ ఈవెంట్ కి సంబందించిన కొన్ని గణాంకాలను విడుదల చేసింది.
ఈ ప్లాట్‌ఫారమ్‌ల వాడకంలో గణనీయమైన పెరుగుదల కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల ఈ ఏడాది మార్చి నాటి నుండి విధించిన లాక్ డౌన్ నుండి నమోదైంది.
వాట్సాప్ ద్వారా ఎటువంటి ఆటంకం, కాల్ ఛార్జీలు లేకుండా వీడియో, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. వారిలో చాలా మంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వాట్సాప్ కాల్స్ సేవలను ఉపయోగించారు.
వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్స్ లో ఒకటి. తాజా గణాంకాలతో 2021 కొత్త ఏడాది రోజున వాట్సాప్ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం 55 మిలియన్ల ప్రత్యక్ష ప్రసారాలు జరిగాయని పేర్కొంది.