Asianet News TeluguAsianet News Telugu

ఆపిల్ స్టోర్, ప్లే స్టోర్ నుండి పార్లర్ యాప్ తొలగింపు.. అమెరికాలొ జరిగిన దాడికి ఈ ఉపయోగించినట్లు ఆరోపణ..

 అమెరికాలో ఇటీవల జరిగిన క్యాపిటల్‌ భవనంపై  దాడి తరువాత, ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను నిషేదించాయి. 

apple and google removes parler app from their app  stores
Author
Hyderabad, First Published Jan 11, 2021, 11:03 AM IST

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్, అమెజాన్  హింస మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాల కారణంగా మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా  యాప్ 'పార్లర్'ను తమ ప్లాట్‌ఫాంల నుండి తొలగించాయి. పార్లర్‌ యాప్ ను ట్విట్టర్ పోటీదారిగా పరిగణిస్తారు.

అమెరికాలో ఇటీవల జరిగిన క్యాపిటల్‌ భవనంపై  దాడి తరువాత, ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను నిషేదించాయి. దీని తరువాత డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు పార్లర్ యాప్ లో సమావేశమవుతున్నారు. 

ఆపిల్ యాప్ స్టోర్‌లో ఉండటానికి సోషల్ మీడియా సంస్థ అయిన 'పార్లర్' యాప్‌లో మార్పులు చేయమని ఆపిల్ సూచించింది. 24 గంటలు గడిచిన కూడా ఎటువంటి మార్పులు చేయకపోవడంతో యాప్ స్టోర్ నుంచి పార్లర్‌ను తొలిగించినట్లు పేర్కొంది.

also read సూపర్ కాంబో ప్యాక్‌ ఆఫర్.. కేవలం రూ.297కే ఛార్జర్-కేబుల్-ఇయర్ ఫోన్, పవర్ బ్యాంక్ కూడా.. ...

ఆపిల్ తన హెచ్చరికలో అభ్యంతరకరమైన పదాలను పార్లర్‌లో పోస్ట్ చేస్తున్నట్లు చాలా ఫిర్యాదులు వచ్చాయి. జనవరి 6న వాషింగ్టన్ డిసిలో జరిగిన క్యాపిటల్‌ భవనంపై దాడిని ప్లాన్ చేయడానికి పార్లర్ ప్లాట్‌ఫాంను ఉపయోగించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. 

ఆపిల్ ఒక వార్తాపత్రిక ప్రకటనలో, "మా ప్లాట్‌ఫామ్‌లో హింసను ప్రేరేపించే చట్ట వ్యతిరేక చర్యల పిలుపుకు ప్రాతినిధ్యం వహించడాన్ని మేము గమనించాము, కాని మా ప్లాట్‌ఫారమ్‌లో హింస, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు చోటు లేదు. అమెజాన్ కూడా తన అమెజాన్ వెబ్ సేవల నుండి పార్లర్ యాప్ ని కూడా తొలగించింది.

పార్లర్  యాప్‌లో ప్రమాదకరమైన కంటెంట్‌ను తొలగించడానికి ఉపయోగించే ఫిల్టర్లు ఏర్పాటు చేసేవరకు మా ప్లాట్‌ఫాంలో స్థానం లభించదు అని పేర్కొంది. పార్లర్‌ యాప్‌ ఐఫోన్‌, ఐపాడ్‌ ఇతర యాపిల్‌ డివైజెస్ లో తొలగించినట్లు ఆపిల్ పేర్కొంది. దీంతో పాటు గూగుల్ కూడా ప్లేస్టోర్ నుంచి పార్లర్ యాప్ ను తొలగించినట్లు పేర్కొంది.   

Follow Us:
Download App:
  • android
  • ios