సూపర్ కాంబో ప్యాక్ ఆఫర్.. కేవలం రూ.297కే ఛార్జర్-కేబుల్-ఇయర్ ఫోన్, పవర్ బ్యాంక్ కూడా..
గత నాలుగు సంవత్సరాలుగా భారత మార్కెట్లో బలమైన పట్టు ఏర్పర్చుకున్నాక రాబోయే రెండేళ్లలో భారతీయ మొబైల్ డివైజెస్ మార్కెట్లో 25 శాతం వాటాను కలిగి ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
బడ్జెట్ బ్రాండ్‌గా తనదైన ముద్ర వేసుకున్న డిటెల్, ఈ కొత్త సంవత్సరంలో #Connect40croreindians పేరుతో గొప్ప ప్రారంభాన్ని ఆరంభించింది. గత నాలుగు సంవత్సరాలుగా భారత మార్కెట్లో బలమైన పట్టు ఏర్పర్చుకున్నాక రాబోయే రెండేళ్లలో భారతీయ మొబైల్ డివైజెస్ మార్కెట్లో 25 శాతం వాటాను కలిగి ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజాగా డిటెల్ కంపెనీ సూపర్-ఎకనామిక్ సిరీస్ పేరుతో మొబైల్ డివైజెస్ శ్రేణిని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త సిరీస్ కింద డి-10 కెఎస్ పవర్‌బ్యాంక్, టార్క్ నెక్‌బ్యాండ్, డి09 ఛార్జర్, డి6 ఇయర్‌ఫోన్స్, డిసి 20w యుఎస్‌బి కేబుల్‌ను అందిస్తుంది.
పవర్‌బ్యాంక్ ధర రూ.499, నెక్ బ్యాండ్ ధర రూ.699 కాగా ఛార్జర్, కేబుల్, ఇయర్‌ఫోన్‌లను కాంబో ప్యాక్ కింద కేవలం రూ.297 కొనుగోలు చేయవచ్చు. www.detel-india.com లేదా b2badda.com వెబ్‌సైట్‌లో అన్ని ఉత్పత్తుల సేల్ ప్రారంభమైంది.
ఈ కాంబో ప్యాక్ వాటి గురించి చెప్పాలంటే పవర్‌బ్యాంక్ మైక్రో యుఎస్‌బి ఛార్జింగ్ ఇన్‌పుట్‌తో వస్తుంది, ఇది పాలిమర్ సెల్ బ్యాటరీతో తయారు చేసారు. ఈ పవర్‌బ్యాంక్ సామర్థ్యం 10,000 ఎంఏహెచ్. బ్లూటూత్ నెక్‌బ్యాండ్ ఆపిల్ సిరి, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ తో వస్తుంది.
కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0 ఉంది. ఈ వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా. దీనిలో 200 ఎంఏహెచ్ బ్యాటరీని ఉంది, 12 గంటల ప్లేటైమ్ క్లెయిమ్ చేయబడింది.
also read పొరపాటున కూడా ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేయవద్దు, లేదంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది.. ...
డిటెల్ డి09 ఛార్జర్ ఒకేసారి రెండు డివైజెస్ ఛార్జ్ చేయగలదు. ఇది 5w / 2.4A అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ ఇస్తుంది. ఈ ఛార్జర్ ఎలక్ట్రిక్ షాక్, వేడెక్కడం వంటి వాటి నుండి పూర్తిగా రక్షించబడిందని కంపెనీ పేర్కొంది.
యుఎస్‌బి కేబుల్ 1.5 ఎ రాపిడ్ ఛార్జ్‌ను అందించడానికి ఆప్టిమైజ్ చేయబడింది. ఇవి నలుపు, తెలుపు రెండు వేర్వేరు రంగులలో లభిస్తాయి. ఈ కేబుల్ చిక్కుకుపోని విధంగా రూపొందించారు. ఈ కేబుల్ రబ్బరైజ్డ్ పివిసి ఫినిషింగ్ తో వస్తుంది.
డి6 ఇయర్ ఫోన్స్ గురించి చెప్పాలంటే దీనికి మాగ్నెట్ బడ్స్ ఉన్నాయి. అంతేకాకుండా కాల్ చేయడానికి ఒక బటన్ కూడా ఉంది. అలాగే ఆటో పవర్ ఆన్ / ఆఫ్ కూడా అందించారు. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ సపోర్ట్ చాలా డివైజెస్ కి ఉపయోగపడుతుంది.
కొత్త సిరీస్ ప్రారంభంపై డెటల్ వ్యవస్థాపకుడు డాక్టర్ యోగేష్ భాటియా మాట్లాడుతూ, 'భారత మార్కెట్లో ప్రారంభించిన బడ్జెట్ ఉత్పత్తులతో మా మొబైల్ డివైజెస్ అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తూన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ స్మార్ట్ డివైజెస్ లో మార్కెట్ డిమాండ్ను మరింత పెంచింది. భారతీయ బ్రాండ్‌గా, విస్తృతమైన ఉత్పత్తి శ్రేణిని తీసుకురావడానికి మేము సంతోషిస్తున్నాము,' అని అన్నారు.