Asianet News TeluguAsianet News Telugu

నా ప్రాణాలకు ముప్పు ఉంది.. ఫేస్‌బుక్ ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు

ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే మహిళతో సహా 5 మందిపై ఎఫ్‌ఐఆర్ లో పేర్లు నమోదైనట్లు ఢీల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. హిమాన్షు దేశ్ ముఖ్, ఆవేష్ తివారీ అనే ఇద్దరు వ్యక్తుల ఫేస్‌బుక్‌ ప్రొఫైల్స్ గుర్తించారు. 

Amid row over, top Facebook executive alleges threat to life and files FIR
Author
Hyderabad, First Published Aug 17, 2020, 6:44 PM IST

తన ప్రాణాలకు ముప్పు ఉందని, లైంగిక వేధింపుల కామెంట్ల పై ఫేస్‌బుక్‌ దక్షిణాసియా ఎగ్జిక్యూటివ్ అంకి దాస్ ఢీల్లీ పోలీస్ సైబర్ సెల్ యూనిట్‌కు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆగస్టు 14న వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఒక కథనం ప్రచురించడంతో అంకి దాస్ హెడ్ లైన్స్ గా మారింది. భారతదేశంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో బిజెపికి ఫేస్‌బుక్‌ మొగ్గు చూపిస్తోందని అందులో ఆరోపించారు.

ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే మహిళతో సహా 5 మందిపై ఎఫ్‌ఐఆర్ లో పేర్లు నమోదైనట్లు ఢీల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. హిమాన్షు దేశ్ ముఖ్, ఆవేష్ తివారీ అనే ఇద్దరు వ్యక్తుల ఫేస్‌బుక్‌ ప్రొఫైల్స్ పోలీసులు గుర్తించారు.

ప్రాణాలకు హాని కలిగించే, హింసాత్మకమైన బెదిరింపులు చేయడంపై భారతీయ శిక్షాస్మృతి, 1860లోని సెక్షన్లు 354 ఎ, 499/500, 506, 507, 509 అమలులో ఉన్న ఇతర చట్ట నిబంధనల కింద వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.

సౌత్ ఢీల్లీ ప్రాంతంలో నివసిస్తున్న 49 ఏళ్ల అంకి దాస్ తన ఎఫ్‌ఐఆర్‌లో "2020 ఆగస్టు 14 సాయంత్రం నుండి నా ప్రాణానికి హాని చేస్తామంటు  బెదిరింపులు వస్తున్నాయని, ఈ వేధింపుల వల్ల నేను చాలా బాధపడుతున్నాను.

also read ఇన్‌స్టాగ్రాం కొత్త అప్ డేట్.. ఇప్పుడు ఫేస్‌బుక్‌ మెసెంజర్‌కు డైరెక్ట్‌ మెసేజ్‌.. ...

నా ఫోటోతో ఉన్న కంటెంట్ ఆధారంగా నాకు, నా కుటుంబ సభ్యులకు హాని కలుగుతుందేమో అని నేను భయపడుతున్నాను. ఒక వార్తా కథనం నా ప్రతిష్టను దెబ్బతీస్తుంది. నేను ఆన్‌లైన్‌లో బెదిరింపులు, ఈవ్-టీజింగ్‌కు గురవుతున్నాను. " అని వెల్లడించారు.

ఫేస్‌బుక్‌ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అయిన అంకి దాస్, డబ్ల్యుఎస్‌జేలో ప్రచురించిన కథనాన్ని అనుసరించి ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉన్న కొంత మంది నన్ను టార్గెట్ చేసుకున్నారని తెలిపారు. "నిందితులు వారి రాజకీయ అనుబంధాల కారణంగా ఉద్దేశపూర్వకంగా నన్ను దుర్భాషలాడారు.

ఇప్పుడు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు, నా పై లైంగిక కామెంట్లు చేశారు. నిందితుల పోస్టుల్లోని కామెంట్లు నా ప్రతిష్టకు హాని కలిగించేలా, నన్ను కించపరిచేలా చేస్తున్నాయని వెల్లడించింది. నా ఫోటోలు, వివరాలను నేరస్తులు షేర్ చేస్తున్నారు.

ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితులను గుర్తించామని ఢీల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. చట్టప్రకారం నిందితులను అరెస్టు చేసి, వారి పై  చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని అన్నారు. ఫేస్‌బుక్‌ ప్రతినిధి "ద్వేషపూరిత, హింసను ప్రేరేపించే కంటెంట్‌ను మేము నిషేధిస్తాము. ఎ రాజకీయ పార్టీతో సంబంధం పెట్టుకోకుండా ప్రపంచవ్యాప్తంగా మా విధానాలను అమలు చేస్తాము అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios